RALLAPALLE ANANTAKRISHNA SHARMA DEATH ANNIVERSARY _ మార్చి 11న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 44వ వర్ధంతి

TIRUPATI, 10 MARCH 2023: The 44th Death Anniversary of renowned scholar Sri Rallapalle Ananta Krishna Sharma will be observed on March 11 at Annamacharya Kalamandiram in Tirupati at 6pm.

 

Sri Sharma was the master brain behind bringing out many popular songs of Tallapaka Annamacharya with appropriate and catchy tunes to the public fore.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

మార్చి 11న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 44వ వర్ధంతి

తిరుపతి, 2023 మార్చి 10: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సం కీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు వందల కృతులను స్వరపరిచిన సంగీత, సాహిత్య విద్వాంసులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 44వ వర్ధంతి కార్యక్రమం మార్చి 11న శనివారం జరుగనుంది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ అధ్యక్షతన జరుగనున్న ఈ కార్యక్రమంలో శ్రీ అనంతకృష్ణశర్మ సాహిత్యంపై ఆయన మనవరాలు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ విభాగాధిపతి ఆచార్య రాళ్లపల్లి దీప్త, మనవడు, ప్రఖ్యాత వేణుగాన విద్వాంసులు శ్రీ ఆర్‌.నందనందన, తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ లక్ష్మణ చక్రవర్తి ఉపన్యసిస్తారు.

శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురం జిల్లా రాళ్లపల్లి గ్రామంలో 1893, జనవరి 23న జన్మించారు. మైసూరు మహారాజ కళాశాలలో 38 సంవత్సరాలు తెలుగు ఆచార్యులుగా సేవలందించారు. రేడియోకు ‘‘ఆకాశవాణి’’ అని పేరు పెట్టింది వీరే. వీరి ప్రతిభను గుర్తించి అప్పటి టీటీడీ ఈవో శ్రీ చెలికాని అన్నారావు 1949లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ బాధ్యతలను అప్పగించారు. అప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని తాళ్లపాక అరలోంచి వెలుగుచూసిన సంకీర్తనలను పరిష్కరించే బాధ్యతను వారికి అప్పగించారు. సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు కొన్ని వందల సంకీర్తనలను ఆయన స్వరపరిచారు. శ్రీఅనంతకృష్ణశర్మను 1979, మార్చి 11న టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియమించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.