WATCHES AND MOBILE PHONES AUCTION _ మార్చి 13న వాచీలు, మొబైల్ ఫోన్లు ఈ-వేలం

TIRUPATI, 29 FEBRUARY 2024: Watches and mobile phones donated by devotees through hundi at Tirumala Srivari Temple and other affiliated temples will be e-auctioned on March 13 through the state government’s purchase portal. 

It includes watches from Titan, Casio, Timex, Alvin, Sonata, Timewell, Fasttrack, Rado companies. Similarly, there are mobile phones of iPhones, Vivo, Nokia, Karbonn, Samsung, Motorola and Oppo companies. A total of 23 lots of new/used/partially damaged watches and 27 lots of mobile phones were e-auctioned.

For other details contact the TTD Marketing Office, Tirupati at 0877-2264429 during office hours, TTD website at www.tirumala.org or the State Government portal at www.konugolu.ap.gov.in

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 13న వాచీలు, మొబైల్ ఫోన్లు ఈ-వేలం

తిరుపతి, 2024 ఫిబ్రవరి 29: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు మరియు మొబైల్ ఫోన్లను మార్చి 13న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్, ర్యాడో కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా ఐ ఫోన్లు, వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లు వున్నాయి.

కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 23 లాట్లు, మొబైల్ ఫోన్లు 27 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.