BTU OF TARIGONDA TEMPLE FROM MARCH 16 – 24 _ మార్చి 16 నుండి 24వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 28 February 2024: TTD is organising the annual Brahmotsavam of Sri Lakshmi Narasimha Temple in Tarigonda between March 16-24 with Ankurarpanam fete on March 15.

On all days Vahana Sevas will be held in the morning and evening.

The following are important events – Dwajarohanam on March  16, Hanumanta Vahana 17, Garuda Vahana on March 21 and Dwajavarohanam on March 24.

TTD is organising Kalyanotsavam on March 21 and Pushpa Yagam on March 25.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 16 నుండి 24వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 ఫిబ్ర‌వ‌రి 28: తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో మార్చి 16 నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

16-03-2024

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – హంసవాహనం,

17-03-2024

ఉదయం – ముత్యపుపందిరి వాహనం

రాత్రి – హనుమంత వాహనం

18-03-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సింహ వాహనం

19-03-2024

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – పెద్దశేష వాహనం

20-03-2024

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – గజవాహనం

21-03-2024

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – స‌ర్వ‌భూపాల వాహ‌నం, కల్యాణోత్సవం, గరుడ వాహనం

22-03-2024

ఉదయం – రథోత్సవం

రాత్రి – ధూళి ఉత్సవం

23-03-2024

ఉదయం – సూర్యప్రభవాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం, పార్వేట ఉత్స‌వం,అశ్వ వాహనం

24-03-2024

ఉదయం – వసంతోత్సవం, చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

మార్చి 21వ తేదీ రాత్రి 8 నుండి 10 గంటల వరకు కల్యాణోత్సవం జరుగనుంది. అదేవిధంగా మార్చి 25వ తేదీ సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వ‌హించ‌నున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.