మార్చి 19 నుండి 28వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మార్చి 19 నుండి 28వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, మార్చి 13, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 19 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మార్చి 18వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

తేదీ ఉదయం సాయంత్రం

19-03-13(మంగళవారం) ధ్వజారోహణం హంస వాహనం
20-03-13(బుధవారం) ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం
21-03-13(గురువారం) కల్పవృక్ష వాహనం సింహ వాహనం
22-03-13(శుక్రవారం) తిరుచ్చి వాహనం పెద్దశేష వాహనం
23-03-13(శనివారం) తిరుచ్చి వాహనం గజ వాహనం
24-03-13(ఆదివారం) తిరుచ్చి వాహనం సర్వభూపాల వాహనం,      కల్యాణోత్సవం మరియు గరుడ సేవ
25-03-13(సోమవారం) రథోత్సవం ధూళి ఉత్సవం
26-03-13(మంగళవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం,
   పార్వేట మరియు అశ్వవాహనం
27-03-13(బుధవారం) వసంతోత్సవం మరియు తిరుచ్చి మరియు
చక్రస్నానం ధ్వజావరోహణం
28-03-13(గురువారం) స్నపన తిరుమంజనం పుష్పయాగం

మార్చి 24వ తేదీ ఆదివారం రాత్రి 8.00 నుండి రాత్రి 10.30 గంటల మధ్య శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక అంగవస్త్రం, రవికె, లడ్డూ ప్రసాదాన్ని బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, తరిగొండ వెంగమాంబ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.