ONLINE SEVA TICKETS _ మార్చి 21న శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల 

TIRUMALA, 20 MARCH 2023: TTD is set to release the June month of Online quota of SRIVANI tickets on March 21 at 3pm.

 

While the online quota of Arjitha Seva tickets including Kalyanotsavam, Dolotsavam, Arjita Brahmotsavam, Sahasra Deepalankara Sevas for the month of June will be released on March 23 at 10am and that of Electronic Dip will be available at 11am onwards on March 24. 

 

The online quota of Angapradakshina tokens for the month of June will be released on March 24 at 10am while that of Senior Citizens and Physically Challenged Darshan tokens for the month of April will be released on March 24 at 3pm.

 

The devotees are requested to make note of this and book accordingly.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 21న శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల

తిరుమల, 20 మార్చి 2023: శ్రీవాణి టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను మార్చి 21వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

మార్చి 23న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్లు….

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 23న ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి. 

అదేవిధంగా, జూన్ నెలకు సంబంధించిన మిగతా ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ మార్చి 24న ఉదయం 11 గంట‌ల‌కు మొదలవుతుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. 

అంగప్రదక్షిణం టోకెన్లు….

జూన్ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మార్చి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.