BTU OF VALMIKIPURAM FROM MARCH 30- APRIL 7 _ మార్చి 30 నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 14 Mar. 20: TTD is organising the annual Brahmotsavams of the local temple of Sri Pattabhirama Swamy at Valmikipuram from March 30-April 7 with koil Alwar Thirumanjanam on March 26 and Ankurarpanam on March 29th.

Important days of Brahmotsavams are dwajarohanam at Meena lagnam on March 30, Garuda vahanam on April 4, Rathotsavam on April 5, Vasantotsavam, chakra snanam and Dwajaavarohanm on April 7

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

మార్చి 30 నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుప‌తి, 2020 మార్చి 14: టిటిడికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరుగనున్నాయి. మార్చి 29వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌వుతాయి. మార్చి 26వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 4న రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఏప్రిల్‌ 8వ తేదీ ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఆలయంలో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు :

తేదీ                                       ఉదయం                     రాత్రి

30-03-2020(సోమ‌వారం)      ధ్వజారోహణం(మీన‌ల‌గ్నం)        గజవాహనం

31-03-2020(మంగ‌ళ‌వారం)   ముత్యపుపందిరి వాహనం         హనుమంత వాహనం


01-04-2020(బుధ‌వారం)       కల్పవృక్ష వాహనం              సింహ వాహనం

02-04-2020(గురువారం)      సర్వభూపాలవాహనం       పెద్దశేష వాహనం

03-04-2020(శుక్ర‌వారం)      సూర్యప్రభ వాహనం    చంద్రప్రభవాహనం, మోహినీ అవతారం

04-04-2020(శ‌నివారం)               తిరుచ్చి ఉత్సవం                  కల్యాణోత్సవం, గరుడ వాహనం

05-04-2020(ఆదివారం)                 రథోత్సవం                 ధూళి ఉత్సవం

06-04-2020(సోమ‌వారం)         తిరుచ్చి ఉత్సవం                అశ్వవాహనం, పార్వేట ఉత్సవం

07-04-2020(మంగ‌ళ‌వారం)      వసంతోత్సవం, చక్రస్నానం         హంస వాహనం, ధ్వజావరోహణం

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.