MAHA CM ASSURES ASSISTANCE TO SRIVARI TEMPLE AND SVBC HINDI CHANNEL IN MUMBAI _ ముంబైలో శ్రీవారి ఆలయానికి భూమి ఇస్తాం – ఎస్వీబీసీ హింది చానల్ కు సహకరిస్తాం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి మహారాష్ట్ర సి ఎం ఉద్ధవ్ ఠాక్రే హామీ

Tirumala, 9 February 2021: The honourable CM of Maharashtra Sri Uddhav Thackeray has positively towards allotment of land Mumbai for constructing SV temple and setting up SVBC Hindi Channel said TTD Chairman Sri YV Subba Reddy.

The TTD Board Chief along with Additional EO and SVBC MD Sri AV Dharma Reddy formally met the Maharashtra CM at Mumbai on Tuesday and sought him for allotment of land to which the Maha CM given his consent. CEO of SVBC Sri Suresh Kumar was also present. 

TTD Chairman said Sri Thakre offered to grant land for the temple at another location of Mumbai if the present one given by the past government was not suitable.

The Maha CM said the government was also keen to extend cooperation in the Hindi channel of SVBC being launched on Ugadi day on April 13.

Sri Thakre also enquired about Dharmic, education, Medical and social welfare programs of the TTD. Thereafter the TTD chairman presented Srivari Theertha – Prasadams to the CM.

The local advisory committee of TTD during their meeting with TTD also offered to extend their full support in setting up the SVBC Hindi channel at Mumbai.

TTD Executive Officer Dr KS Jawahar Reddy also participated through video conferencing in the meeting with Mumbai local advisory committee on Tuesday evening.

The TTD has also decided to conduct a Srinivasa Kalyanam fete at Mumbai soon.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముంబైలో శ్రీవారి ఆలయానికి భూమి ఇస్తాం – ఎస్వీబీసీ హింది చానల్ కు సహకరిస్తాం

టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి మహారాష్ట్ర సి ఎం ఉద్ధవ్ ఠాక్రే హామీ

తిరుమల 9 ఫిబ్రవరి 2021: ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని, ఎస్వీబీసీ హింది చానల్ కు సహకరిస్తామని మహారాష్ట్ర సి ఎం శ్రీ ఉద్ధవ్ ఠాక్రే టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి హామీ ఇచ్చారు.

ముంబైలో మంగళవారం రాత్రి అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్ తో పాటు శ్రీ సుబ్బారెడ్డి సి ఎం ను కలిశారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి సహకారం అందించాలని సీఎం ను చైర్మన్ కోరారు. గత ప్రభుత్వం కేటాయించిన భూమి పరిశీలించాలని, అది అనువుగా లేదనుకుంటే ఇంకో చోట భూమి కేటాయిస్తామని శ్రీ ఠాక్రే చెప్పారు. ఎస్వీబీసీ హింది చానల్ ను ఉగాదికి ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చైర్మన్ వివరించారు. హిందూ ధర్మ ప్రచారం కోసం చానల్ కు కూడా ప్రభుత్వ సహకారం అందించాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని సిఎం చెప్పారు. టీటీడీ చేపట్టిన ధార్మిక కార్యక్రమాల గురించి సిఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి సిఎం కు స్వామి వారి ప్రసాదాలు అందించి శేష వస్త్రం తో సన్మానించారు.

అన్ని విధాలా సహకరిస్తాం : ముంబై సలహామండలి హామీ

ముంబైలో శ్రీవారి ఆలయం, ఎస్వీబీసీ హింది చానల్ ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తామని స్థానిక సలహామండలి సభ్యులు హామీ ఇచ్చారు. మంగళవారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి,ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్ సలహామండలి సభ్యులతో సమావేశమయ్యారు. ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ముంబైలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది