NARAPURA VENKATESWARA BTU _ మే 13 నుండి 21వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 06 MAY 2022: The annual brahmotsavams of Sri Narapura Venkateswara Swamy temple in Jammalamadugu will be observed between May 13 to 21 with Ankurarpana on May 12. The Koil Alwar Tirumanjanam fete will be observed on May 8.

 

The important days includes, Dhwajarohanam on May 13, Garuda Seva n May 17, Rathotsavam on May 19 and Chakra Snanam on May 21.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

 

 

మే 13 నుండి 21వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2022 మే 06: జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 13 నుండి 21వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 12వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

తేదీ ఉదయం సాయంత్రం

13-05-2022 ధ్వజారోహణం పెద్దశేష వాహనం

14-05-2022 చిన్నశేష వాహనం హంస వాహనం

15-05-2022 ముత్యపుపందిరి వాహనం సింహ వాహనం

16-05-2022 కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం

17-05-2022 పల్లకీ ఉత్సవం గరుడ వాహనం

18-05-2022 సర్వభూపాల వాహనం కల్యాణోత్సవం, గజ వాహనం

19-05-2022 రథోత్సవం అశ్వవాహనం

20-05-2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

21-05-2022 చక్రస్నానం ధ్వజావరోహణం


బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.300/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. మే 22వ తేదీన పుష్పయాగం జరుగనుంది.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.