BTU FROM MAY 13-21 _ మే 13 నుండి 21వ తేదీ వరకు నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 27 APRIL 2022: The annual Brahmotsavams in Narayanavanam are scheduled between May 13 and 21.

 

On May 8, Koil Alwar Tirumanjanam, May 12 Ankurarpanam will be observed.

 

The important days of Sri Kalyana Venkateswara temple annual fete include Garuda Seva on May 17, Rathotsavam and Kalyanotsavam on May 20 and Chakra Snanam on May 21.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 13 నుండి 21వ తేదీ వరకు నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2022 ఏప్రిల్ 27: నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మే 13 నుండి 21వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 8న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 12న అంకురార్పణం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

13-05-2022 ధ్వజారోహణం పెద్దశేష వాహనం

14-05-2022 చిన్నశేష వాహనం హంస వాహనం

15-05-2022 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

16-05-2022 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

17-05-2022 మోహినీ అవతారం గరుడ వాహనం

18-05-2022 హనుమంత వాహనం గజ వాహనం

19-05-2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

20-05-2022 రథోత్సవం కల్యాణోత్సవం, అశ్వవాహనం

21-05-2022 చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీ రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.1000/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.