మే 14 నుండి 16 వరకు వార్షిక వసంతోత్సవాలు

మే 14 నుండి 16 వరకు వార్షిక వసంతోత్సవాలు

 తిరుపతి, మే-13,  2009: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మే 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

ఈ ఉత్సవాలలో పాల్గొన దలచిన గృహస్థులు ఒక టిక్కెటుకు గాను ఒకరోజుకు 516/- రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చును. గృహస్థులకు ఒక అంగవస్త్రము, రవిక, అన్నప్రసాదములు బహుమానంగా ఇస్తారు. ఈ సందర్భంగా మే 14,15 తారీకున మధ్యాహ్నం 3.30 నుండి 5.00 వరకు శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరము ఊంజల్‌ సేవ, వీది ఉత్సవం కూడా నిర్వహిస్తారు.

మే 16వ తేదిన మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీసత్యభామ, రుక్మిణీ సమేత శ్రీకృష్ణ మరియు శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీరామ ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.  అనంతరం ఊంజల్‌ సేవ నిర్వహిస్తారు.

ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం మరియు ఆర్జిత  బ్రహ్మోత్సవం రద్దు చేయబడును.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.