RAMPACHODAVARAM MAHASAMPROKSHANAM _ మే 17నుండి 22వరకు రంపచోడవరంలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ – ఏర్పాట్లను పరిశీలించిన జేఈవో శ్రీవీరబ్రహ్మం

TIRUPATI, 20 APRIL 2023: The Maha Samprokshanam rituals in Srivari temple at Rampachodavaram will be observed between May 17 and 22, said TTD JEO Sri Veerabrahmam.

 

During his inspection to the temple located in Alluri Seetaramaraju Manyam district of AP along with a few officials of TTD on Thursday, the JEO said, the pending works related to Water Pumping Plant, Security, temple arch etc. to be completed at a fast pace.

 

He also directed to erect CC cameras, to get ready the Panchaloha idols for the rituals, Tandlu for vahanams, Gatatopam, fire extinguishers, electrical illumination etc.

 

The JEO instructed the concerned to give wide publicity so that the devotees from the surrounding places of Rajamundry, Addateegala, Rajavommangi, Gokavaram etc. to have darshan of the presiding deity after the completion of Maha Samprokshanam rituals.

 

In view of the anticipated devotee rush on May 22, he directed all the concerned officers to be ready with the arrangements of Annaprasadam, water, buttermilk etc.

 

The JEO also negotiated with ITDA Project Officer Sri Suraj, sub-collector Sri Bansal, and Additional SP Sri Adiraj Singh over the Maha arrangements.

 

TTD CE Sri Nageswara Rao, SEs Sri Satyanarayana, Sri Venkateswarulu, DyEOs Sri Vrnkataiah, Sri Gunabhushan Reddy, VGO Sri Manohar, AEO Sri Ramesh and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 17నుండి 22వరకు రంపచోడవరంలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ – ఏర్పాట్లను పరిశీలించిన జేఈవో శ్రీవీరబ్రహ్మం

రాజమండ్రి, 20 ఏప్రిల్ 2023: అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా రంపచోడవరంలో టీటీడీ నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మే 17నుండి 22వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నామని జేఈవో శ్రీవీరబ్రహ్మం తెలిపారు.

ఆలయ నిర్మాణ పనులను గురువారం జేఈవో ఆధ్వర్యంలోని అధికారుల బృందం పరిశీలించింది. అనంతరం జేఈవో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆలయ ప్రవేశ మార్గంలో ఆర్చి, ఆలయంలో బోరు, వాటర్ పంపింగ్ ప్లాంట్, సెక్యూరిటీ సిబ్బంది గది, కార్యాలయ గది నిర్మాణ పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. భద్రత చర్యల్లో భాగంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మహాసంప్రోక్షణ కార్యక్రమం కోసం పంచలోహ విగ్రహాలు, అవసరమైన ఆభరణాలు సిద్ధం చేయాలన్నారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడానికి అనువైన చోట కౌంటర్ ఏర్పాటు చేయాలని, వాహన సేవలకు తండ్లు, గటాటోపం, అగ్నిప్రమాదాలు నివారించే యంత్రాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని శ్రీవీరబ్రహ్మం ఆదేశించారు.

నాలుగుమాడ వీధుల్లో జరుగుతున్న పనులు వేగం పెంచాలన్నారు. వాహనాల పార్కింగ్ కు అవసరమైన స్థలాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. ఆలయానికి వచ్చే రోడ్డు మార్గంలో సోలార్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, ఆలయం చుట్టూ, ఆలయ గోపురం పైన విద్యుత్ అలంకరణలు ఆకట్టుకునేలా ఉండాలన్నారు. ఆలయానికి సమీపంలోని కొండ మీద శంఖు చక్రాలు ఏర్పాటు చేయాలన్నారు. గోపురానికి పిడుగుల నుండి రక్షణ కల్పించేలా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు.

మహా సంప్రోక్షణ సందర్బంగా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ బాగా ఉండేలా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. చుట్టుపక్కల ప్రాంతాలైన రాజమండ్రి, అడ్డతీగల, రాజవొమ్మంగి, గోకవరం ప్రాంతాలనుండి భక్తులు మహాసంప్రోక్షణ అనంతరం స్వామివారిని దర్శించుకునేలా తగినంత ప్రచారం నిర్వహించాలని జేఈవో చెప్పారు.

మహాసంప్రోక్షణ కార్యక్రమాల నిర్వహణకు వచ్చే అర్చకులు, వేద పండితులు,అధికారులు, సిబ్బందికి వసతి, భోజన ఏర్పాట్ల గురించి జేఈవో అధికారులతో చర్చించారు. మే 22వ తేదీ మహాసంప్రోక్షణ సందర్బంగా వేలాదిమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందువల్ల వారందరికీ తాగునీరు, అన్నప్రసాదాల వితరణ మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని జేఈవో అధికారులను ఆదేశించారు.
అనంతరం శ్రీవీరబ్రహ్మం ఐ టి డి ఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ సూరజ్, సబ్ కలెక్టర్ శ్రీ బన్సాల్, అదనపు ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ను కలసి మహాసంప్రోక్షణ ఏర్పాట్ల గురించి చర్చించారు.

టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీనాగేశ్వరరావు, ఎస్ఈ లు శ్రీసత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవోలు శ్రీగుణభూషణ్ రెడ్డి, శ్రీ వెంకటయ్య, విజివో శ్రీమనోహర్, ఎఈవో శ్రీరమేష్ ఈ ఈ సుధాకర్ , ఆనంద్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది