మే 19న శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల‌కు అంకురార్పణ

మే 19న శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల‌కు అంకురార్పణ

 తిరుపతి, 2010 మే 12: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 20వ తేది నుండి 28వ తేది వరకు వైభవంగా జరుగుతాయి. 19వ తేదిన అంకురార్పణం నిర్వహిస్తారు.

ఈ బ్రహ్మోత్సవాలలో శ్రీ గోవిందరాజస్వామి వారు ప్రతిరోజు ఈక్రింది వాహనాలను అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు.

తేది ఉదయం       సాయంత్రం
20-05-2010 ధ్వజారోహణం (ఉ.9.05 గంటలకు) పెద్దశేష వాహనం
21-05-2010 చిన్నశేష వాహనం హంస వాహనం
22-05-2010 సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
23-05-2010 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
24-05-2010 పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారం) గరుడ సేవ
25-05-2010 హనుమంత వాహనం గజ వాహనం
26-05-2010 సూర్యప్రభ వాహనం చంద్రఫ్రభ వాహనం
27-05-2010 రథోత్సవం (ఉ.7.45 గంటలకు) అశ్వ వాహనం
28-05-2010 పల్లకీ ఉత్సవం ధ్వజ అవరోహణం
(బంగారు తిరుచ్చి ఉత్సవం)

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.