KOIL ALWAR TIRUMANJANAM _ మే 24న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

TIRUPATI, 21 MAY 2023: In connection with the annual brahmotsavams in Sri Kalyana Venkateswara Swamy temple at Narayanavanam, the traditional temple cleansing fete, koil alwar tirumanjanam will be observed on May 24.

The annual brahmotsavams are scheduled between May 31 to June 8. The entire temple and sub-temples in the temple complex will be cleaned with an aromatic mixture called Parimalam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 24న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుపతి, 2023 మే 21: నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 24న ఉదయం 6-30గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

మే 31 నుండి జూన్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం మ‌ధ్యాహ్నం 1.30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.