Press Release on GOVINDA KALYANAM _ మే 27 నుండి జూన్‌ 6 వరకు విశాఖలో గోవింద కల్యాణాలు

Tirupati May-24, 2010: under the auspices of TTD Annamacharya Project, Tirupati 2nd phase Govinda Kalyanams will be conducted in the following places in Vizag District of Andhra Pradesh from 27-5-2010 to 06-06-2010.

The Places are Araku on May-29, G.Madugula on May-29, Paderu on May-30, Koyyuru on June-01, G.K.Street on June-02, Chintapalle on June-04, Narsipatnam on June 5&6.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD.

మే 27 నుండి జూన్‌ 6 వరకు విశాఖలో గోవింద కల్యాణాలు

తిరుపతి, 2010 మే 24: తిరుమల తిరుపతి దేవస్థానముల అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో రెండవ విడత గోవింద కల్యాణాలు మే 27వ తేది నుండి జూన్‌ 6 వరకు విశాఖపట్నం జిల్లాలో నిర్వహిస్తారు.

ఈ కల్యాణాలు మే 27వ తేదిన అరకు నందు, మే 29వ తేదిన జి.మాడుగుల, మే 30వ తేదిన పాడేరు, జూన్‌ 1వ తేదిన కొయ్యూరు, జూన్‌ 2వ తేదిన జి.కె.వీధి, జూన్‌ 4వ తేదిన చింతపల్లె, జూన్‌ 5,6 తేదిలలో నర్సీపట్నం నందు నిర్వహిస్తారు.

శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తాగ్రేశుడైన శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యుల 602వ జయంతి ఉత్సవాలు ఈ నెల 27వ తేది నుండి 29వ తేది వరకు ఘనంగా జరుగుతాయి.

అన్నమయ్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతి, తాళ్ళపాకలలో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తాళ్ళపాక దగ్గరగల 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద 27వ తేది ఉదయం 5.30 నుండి సాయంత్రం 6.30 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వందలాది మంది కళాకారులచే సప్తగిరి సంకీర్తన గోష్ఠీగానం వైభవంగా జరుగుతుంది.

ఈ సందర్భంగా తాళ్ళపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం నందు ఈనెల 27వ తేదిన శ్రీవారి స్నపన తిరుమంజనం, 28వ తేదిన ఊంజల్‌సేవ, 29వ తేదిన అన్నమాచార్య సంకీర్తనా కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.