మే 31 నుండి జూన్‌ 8వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 31 నుండి జూన్‌ 8వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, మే 27, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 31 నుండి జూన్‌ 8వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 30వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తేదీ ఉదయం సాయంత్రం

31-05-13(శుక్రవారం) ధ్వజారోహణం(మిథునలగ్నం) పెద్దశేష వాహనం
01-06-13(శనివారం) చిన్నశేష వాహనం హంస వాహనం
02-06-13(ఆదివారం) సింహ వాహనం   ముత్యపుపందిరి వాహనం
03-06-13(సోమవారం) కల్పవృక్ష వాహనం      కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
04-06-13(మంగళవారం) మోహినీ అవతారం గరుడ వాహనం
05-06-13(బుధవారం) హనుమంత వాహనం గజ వాహనం
06-06-13(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
07-06-13(శుక్రవారం) రథోత్సవం అశ్వవాహనం
08-06-13(శనివారం) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో జూన్‌ 3వ తేదీ సాయంత్రం 5.00 నుండి 6.30 గంటల వరకు  స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించ నున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు ఊంజల్‌ సేవ సమయంలో అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, ప్రతిరోజూ రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు  హరికథ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.