రక్తదానంతో ప్రాణదానం
రక్తదానంతో ప్రాణదానం
తిరుమలలో రక్తదానం చేసిన టీటీడీ అదనపు ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి
తిరుమల, 2026 నవంబర్ 24: ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడవచ్చని టీటీడీ అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమలలో ప్రసాదాలు తయారు చేసే పోటు సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.
తిరుమలలోని మహాలక్ష్మి బ్లాక్ లో పోటు వర్కర్స్ సొసైటీ, యంగిస్థాన్ యూత్ ఫర్ సొసైటీ కలిసి ఆశ్విని ఆసుపత్రి ఆధ్వర్యంలో స్విమ్స్ బ్లడ్ బ్యాంక్ కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో రక్తదానం చేశారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ శిబిరంలో పోటు సిబ్బంది మొత్తం 122 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.



