RADHASAPTHAMI OBSERVED WITH CELESTIAL GRANDEUR _ రథసప్తమికి విశేషంగా తరలివచ్చిన భక్తులు

PILGRIMS EXPRESS IMMENSE PLEASURE OVER THE ARRANGEMENTS BY TTD

TTD MANDARINS THANKS EVERYONE FOR MAKING THE MEGA EVENT A HUGE SUCCESS

TIRUMALA, 28 JANUARY 2023: The devotees who thronged to witness the Vahana Sevas during Radhasapthami on Saturday expressed their immense pleasure and satisfaction over the elaborate arrangements made by TTD in terms of serving Annaprasadam, distributing water and providing security to the pilgrims.

TTD had laid temporary German sheds in galleries wherever needed and provided shade to the devotees. The floral and electrical decorations stood as an added attraction. 

The distribution of Annaprasadam commenced at 4am in the galleries on Saturday with milk and beverages followed by Pongal at 7am, varieties of “Ready to Eat” rice at different intervals. Besides, biscuits and sundal were also served as evening snacks to devotees. A total of 8 lakh servings including 4lakh rice varieties, 2.5lakh beverages and 1.5lakh snacks. 

About 1000 sanitary workers were deployed to keep the premises clean at regular frequencies. Nearly 40 tonnes of garbage has been cleared in 26 trips. Besides, the services of 600 odd sevaks were utilized to provide water to the pilgrims in galleries. 

A team of 850 TTD Vigilance in coordination with Police with the services of 300 scouts and guides offered security services to the pilgrims and ensured a hassle-free event. 

The services of 25 doctors, 50 para medical staff with the help of 2 mobile clinics and 4 ambulances were utilised.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam have appreciated the team work of TTD officials and employees with Police, Srivari Sevaks, Scouts and Guides in providing services to the scores of pilgrims who thronged Tirumala to witness the Saptha Vahana Sevas on the occasion of Radhasapthami on Saturday. They thanked everyone for the execution of their respective duties with dedication and especially the pilgrims for making the event a grand success.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రథసప్తమికి విశేషంగా తరలివచ్చిన భక్తులు

సంతృప్తికరంగా వాహనసేవల దర్శనం

తిరుమల, 28 జనవరి 2023: సూర్యజయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు.

 చలికి, ఎండకు ఇబ్బందుల్లేకుండా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్ల‌లో భక్తులు సౌక‌ర్య‌వంతంగా కూర్చుని వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించారు. శ్రీవారి సేవ‌కులు భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేశారు. షెడ్ల‌కు అనుబంధంగా మరుగుదొడ్లు, మూత్ర విసర్జనశాలలను భక్తులకు అందుబాటులో ఉంచారు. శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్య కూడళ్లలో శోభాయమానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 850 మంది టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, 500 మంది పోలీసుల సేవలను వినియోగించుకున్నారు. 3000 మంది శ్రీవారి సేవకులు, 300 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భక్తులకు సేవలందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్షప్రసారం చేశారు.

టిటిడి వైద్య విభాగం ఆధ్వర్యంలో 4 వేల మంది భక్తులకు 25 మంది డాక్టర్లు, 50 మంది పారామెడికల్ సిబ్బంది వైద్యసేవలందించారు. 2 మొబైల్ క్లినిక్ లు, 4 అంబులెన్సులు ఏర్పాటు చేశారు.

సౌకర్యాలను భక్తులను అడిగి తెలుసుకున్న టిటిడి జెఈవోలు

వాహనసేవలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు గ్యాలరీల్లో కల్పించిన సౌకర్యాలను టిటిడి జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం స్వయంగా అడిగి తెలుసుకున్నారు. టిటిడి సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నప్రసాదాలు బాగున్నాయని ధన్యవాదాలు తెలియజేశారు.

టిటిడి సిబ్బందికి, శ్రీ‌వారి సేవ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు

 ర‌థ‌స‌ప్తమి సంద‌ర్భంగా వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించేందుకు ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు గ్యాల‌రీల్లో ఉన్న భ‌క్తుల‌కు టిటిడి అధికారులు, సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు, పోలీసులు విశేషంగా సేవ‌లందించార‌ని జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం కొనియాడారు. ఈ సంద‌ర్భంగా వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.