RALLAPALLI WAS AN EXPONENT IN MUSIC AND LITERATURE –  SCHOLARS _ రాళ్లపల్లి వారికి సంగీత, సాహిత్యాల్లో సమప్రజ్ఞ

Tirupati, 11 March 2024: TTD run Annamacharya project Director Dr Akella Vibhishana Sharma advocated that eminent scholar late Sri Rallapalli Ananthakrishna Sharma was an accomplished personality in both music and literature. 

The TTD Annamacharya Project and All Hindu Projects jointly organized the 45th death anniversary of Sri Rallapalli Ananthakrishna Sharma at Annamacharya Kalamandiram in Tirupati on Monday evening. 

Earlier, the TTD officials paid floral tributes to the statue of Sri Rallapalli Anantha Krishna Sharma on Sri Padmavati Mahila University Road in the morning.

Dr. Vibhishana Sharma who presided over the program said that in 1949, TTD handed over the responsibility of Sri Venkateswara Oriental Research Institute to Sri Rallapalli.  He is said to have composed hundreds of Sankirtans besides fixing the scriptures from the copper plates that were identified from the Tallapaka shelf in the Tirumala Srivari Temple. 

It is said that only people like Sri Rallapalli, who are skilled in Shabdarthas, can solve Annamayya’s sankirtanas well.  He explained that they experienced the mysticism of the music and lyrics of Annamayya’s hymns and presented them to the world. 

Later famous poet Sri Puttaparthi Narayanacharya said that Sri Rallapalli was compared to  Sage Vyasa.

Afterwards, Acharya Rallapalli Deepta, the granddaughter of Sri Rallapalli and Head of the Department of English, National Sanskrit University, spoke on the topic “Sri Rallapalli’s Vaidushyam”.  She said that Sri Rallapalli has solved and written about two thousand Annamayya Sankirtans.  

Renowned singer Smt. NC Sridevi spoke on the topic “Rallapalli Vari Sweya Kritulu”.  

DEO Dr. Bhaskar Reddy and others participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

రాళ్లపల్లి వారికి సంగీత, సాహిత్యాల్లో సమప్రజ్ఞ

•⁠ ⁠అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ

•⁠ ⁠ఘనంగా శ్రీ అనంతకృష్ణశర్మ 45వ వర్ధంతి

•⁠ ⁠విగ్రహానికి ఘ‌నంగా పుష్పాంజలి

తిరుపతి, 2024 మార్చి 11: సంగీతం, సాహిత్యంలో సమప్రజ్ఞ గల వాగ్గేయకారుడు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ అని అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ కొనియాడారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం రాత్రి శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 45వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కాగా, ఉదయం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ మార్గంలోని శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటించారు.

సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా. విభీషణశర్మ మాట్లాడుతూ 1949లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ బాధ్యతలను శ్రీ రాళ్లపల్లివారికి టీటీడీ అప్పగించిందన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని తాళ్లపాక అరలోంచి వెలుగుచూసిన రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు కొన్ని వందల సంకీర్తనలను ఆయన స్వరపరిచారని తెలిపారు. శబ్దార్థాలపై నైపుణ్యం గల శ్రీ రాళ్లపల్లి లాంటి వారే అన్నమయ్య సంకీర్తనలను చక్కగా పరిష్కరించగలరని చెప్పారు. అన్నమయ్య సంకీర్తనల్లో గల సంగీతం, సాహిత్యంలోని మార్మికతను వారు అనుభవించి లోకానికి అందించారని వివరించారు. ప్రముఖ కవి శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు శ్రీ రాళ్లపల్లివారిని సాక్షాత్తు వ్యాసులవారితో పోల్చారని చెప్పారు.

అనంతరం శ్రీ రాళ్లపల్లి వారి మనవరాలు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ విభాగాధిపతి ఆచార్య రాళ్లపల్లి దీప్త “శ్రీ రాళ్లపల్లివారి వైదుష్యం” అనే అంశంపై ప్రసంగించారు. శ్రీ రాళ్లపల్లి వారు దాదాపు రెండు వేల అన్నమయ్య సంకీర్తనలను పరిష్కరించి గ్రంథస్తం చేశారని తెలిపారు. కృతులు సంగీతానికి, కీర్తనలు భక్తికి, పదములు సంగీత, సాహిత్యానికి ప్రధానమైనవని రాళ్లపల్లి వారు తెలియజేశారని వివరించారు.

ప్రముఖ గాయకురాలు శ్రీమతి ఎన్.సి.శ్రీదేవి “రాళ్లపల్లి వారి స్వీయ కృతులు” అనే అంశంపై ప్రసంగించారు. రాళ్లపల్లి వారి పలు కృతులను ఆలపించి అందులోని ఎత్తుగడలు, ఇతర విశేషాలను తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో డీఈవో శ్రీ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.