రిసోర్స్‌పర్సన్లుగా ఆసక్తిగలవారు నేరుగా సంప్రదించాలి 

రిసోర్స్‌పర్సన్లుగా ఆసక్తిగలవారు నేరుగా సంప్రదించాలి

తిరుపతి, జూలై-2,  2009: తితిదే ఉద్యోగుల శిక్షణ కేంద్రం(శ్వేత)లో రిసోర్స్‌ పర్సన్లుగా ఆసక్తిగల వారు నేరుగా సంప్రదించాలని శ్వేత సంచాలకులు భూమన్‌ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శిక్షణలో హిందూ సనాతన ధర్మం పై విస్తృత అవగాహన, వివిధ భాషల్లో ప్రావీణ్యం, మానసిక ఒత్తిడి, ఆరోగ్య పరిరక్షణ, ఆలయ పరిపాలన, శుచి, శుభ్రత, యోగా, ధ్యానం తదితర అంశాలపై తరగతులు నిర్వహింపబడుచున్నది. దీంతోపాటు వైఖానస, శైవాగము, స్మార్త అర్చకులకు పూజా విధానం పై లఘు పద్ధతి శిక్షణ అందించుటకు రిసోర్స్‌ పర్సన్లు అవసరం.

పెన్షన్‌ రూల్సు, ఫండ్‌మెంటల్‌ రూల్సు, కాండక్ట్‌ రూల్సు, డిసిప్లినరీ ప్రొసీజర్స్‌, ఎండోమెంట్‌ యాక్ట్‌ మరియు రూల్సు, ఎంప్లాయిస్‌ రూల్సు, అకౌంట్‌ టెస్ట్‌, పార్ట్‌- |, || , ఆడిట్‌ టెస్ట్‌, ఇ.ఒ.టెస్ట్‌, జు కోడ్‌, ఈ కోడ్‌, పాలనలో తెలుగు అమలు, తెలుగులో నోట్‌ఫైల్‌ రాయడం పై అవగాహన తదితర అంశాలను బోధించుటకు ఆసక్తిగల వారు రిసోర్సు పర్సన్లుగా హాజరుకావచ్చు. వివరాలకు శ్వేత కార్యాలయం పనివేళల్లో నేరుగా సంప్రదించవలసిందిగా ఆయన ఒక ప్రకటనలో కోరారు.శ్రీ

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.