‌TTD MULLS MANGALA SUTRAS AS PART OF HINDU SANATANA DHARAMA-CHAIRMAN _ రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌

TRUST BOARD APPROVES ANNUAL BUDGET FOR Rs.5141.74Cr IN 2024-25

 

THANKS CM OF AP FOR SANCTIONING HOUSE SITES TO TTD EMPLOYEES

 

TIRUMALA, 29 JANUARY 2024: As a part of its noble mission of taking forward the Sanatana Hindu Dharma Prachara, the TTD Trust Board under the Chairmanship of Sri Bhumana Karunakara Reddy has decided to make mangalsutras weighing 5gms and 10gms and sell them to the devotees after getting the divine blessings for a blissful married life of the couple.

 

The TTD Board resolved on many important issues during the board meeting held at Annamaiah Bhavan in Tirumala on Monday. Briefing the media after the Board meeting, the TTD Chairman along with the Executive Officer Sri AV Dharma Reddy has informed the media on the various developmental programmes approved by the board. Some excerpts:

 

The Hindu Marriage system is known for its chastity and the Hindu women strongly believes in the great bond of marital system by wearing Mangalasutram. “During my previous term as TTD Trust board chief, I have performed 32thousand marriages to poor couples through the unique Kalyanamastu programme and none of them were converted to other religion in the last 17 years. By introducing the sale of Mangalasutram which have the blessings of Sri Venkateswara Swamy, it will help them to further strengthen their bond and lead a blissful married life. These Mangalasutrams will be prepared in 5 grams and 10 grams on cost-to-cost basis in four or five designs. Along with these, it has also been decided to make Lakshmi kasulu too”, the Chairman added.

 

The Board has approved for Rs.5,141.74crore budget for the financial year 2024-25

 

Some other important Resolutions:

 

Approval of tenders towards the construction of a gravel road in an additional 132.05 acres of land allocated at Padiredu Aranyam of Vadamalapet Mandal for housing of TTD employees.

 

Approval to increase the wages of 70 contract laddu tray lifting semi-skilled and unskilled workers in TTD Potu department from Rs.12,523/- to Rs.15,000/-.

 

Nod to increase the wages of those working under contract and outsourcing system in various departments of TTD.

 

The Six Vedic schools of TTD have been spreading the Vedic education as part of Hindu Sanatana Dharma Prachara. The board has given nod to increase the salaries of 51 Vedic teachers working in these schools from Rs.35 thousand to Rs.54 thousand.

 

138 cleaners and 79 cooks in the Annaprasadam department have been changed to the skilled category and their wages increased from Rs.17 thousand to Rs.22 thousand.

 

Similarly, the workers in electrical and water works have been changed from unskilled to skilled category.

 

Approval to introduce Oracle Fusion Cloud ERP for a period of five years with the latest technology to manage TTD governance more quickly and transparently.

 

Approval for installation of audiovisual connectivity equipment as part of modernization of Tirumala Annamayya Building Conference Hall.

 

Nod to increase the wages of sculptors at the TTD-run Sri Venkateswara Traditional Sculpture and Architecture Institute as part of the promotion and encouragement of traditional arts

 

The salary of Sri Munaswamy Reddy, an expert in Kalamkari art, has been increased from Rs.25 thousand to Rs.39 thousand.

 

The board has resolved to send the creation of some religious posts in 26 sub-temples(227 posts) and 34 taken-over temples(288 posts) of TTD for the approval of the state government. 

 

Approval of tender for Rs 30.71 crore to develop two lane road from Akashaganga to Outer Ring Road in Tirumala to four lane road to over come the traffic problem along this route.

 

Tenders approved towards the development works of Saptagiri Rest Houses – Block No. 6 and 7 worth Rs.2.28 crores for the convenience of devotees who come across the country to visit Tirumala.

 

Nod for the administrative sanction for Rs.10.90 crore towards taking up the development and painting works of Sri Venkateswara, Adiseshu, Shankumitta Rest Houses in Tirumala.

 

Approval of sanction of Rs.6.90 crores towards the construction of Rajagopuram and stone prakaram for the ancient shrine of Sri Bhadrakali Sametha Veerabhadraswamy temple in Narayanavanam.

 

After the division of the state, upon the instructions of the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy, an exclusive super speciality hospital for children has been set up by TTD at the lotus feet of Sri Venkateswara Swamy in the  temple City of Tirupati. This hospital will henceforth be renamed as Sri Padmavati Institute of Child Health.

 

Approval to introduce Oracle Fusion Cloud ERP for a period of five years with the latest technology to manage TTD governance more effectively, quickly and transparently.

 

Approval for installation of audiovisual integrator equipment as part of the modernization of the Conference Hall of Annamaiah Bhavan at Tirumala.

 

THANKS TO CM SIR

 

The TTD Trust Board has thanked the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy, for sanctioning the house sites to TTD employees fulfilling their several decades-old wish making their dream to become a reality.

 

Later, the fact-finding committee of Srivani Trust, which was formed by the Tirupati Press Club President Sri. Bhaskar Reddy and other media representatives of Tirumala and Tirupati, handed over its report to the TTD Chairman Sri. Bhumana Karanakara Reddy and EO Sri. AV. Dharma Reddy.

             

Some board members, JEOs Smt. Sada Bhargavi and Sri. Veerabraham participated.

 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌

– ఉద్యోగుల‌కు ఇళ్లస్థ‌లాలు ఇచ్చిన‌ ముఖ్యమంత్రివర్యులకు కృత‌జ్ఞ‌త‌లు

– శ్రీ‌వారి ఆశీస్సుల‌తో మ‌హిళ‌ల‌కు మంగ‌ళ‌సూత్రాలు

– కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వేత‌నాలు పెంపు

– టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి

తిరుమ‌ల‌, 2024 జ‌న‌వ‌రి 29: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన‌ట్టు టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తెలిపారు. ఛైర్మ‌న్ అధ్యక్ష‌త‌న సోమ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఇందులో ముఖ్య నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి.

– ధర్మప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలను తయారుచేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందిన తరువాత భక్తులకు విక్రయించేందుకు నిర్ణయం. ఇవి 5 గ్రాములు, 10 గ్రాముల్లో ఉంటాయి. వీటిని నాలుగు లేదా ఐదు డిజైన్లలో తయారు చేస్తాం. వీటితోపాటు లక్ష్మీకాసులను కూడా తయారు చేయాలని నిర్ణయం. వీటిని లాభాపేక్ష లేకుండా విక్ర‌యిస్తాం. గ‌తంలో 32 వేల మందికి సామూహిక వివాహాలు జ‌రిపించిన‌పుడు మంగ‌ళ‌సూత్రాలు అందిస్తే ఏ ఒక్క‌రూ మ‌తం మార‌లేదు. మ‌హిళ‌ల‌కు స్వామివారి కానుక ఇది.

– టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్‌ రోడ్డు ఏర్పాటుకు టెండరు ఆమోదం.

– దాదాపు 30 ఏళ్లుగా ఇళ్లస్థలాల కోసం ఎదురుచూసిన టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన మాన్య ముఖ్యమంత్రివర్యులు శ్రీవైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిగారికి టీటీడీ పాలకమండలి కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

– టీటీడీలోని వివిధ విభాగాల‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో ప‌నిచేసే వారికి వేత‌నాలు పెంచాం.

– టీటీడీ పోటు విభాగంలోని 70 మంది కాంట్రాక్టు లడ్డూ ట్రే లిఫ్టింగ్‌ సెమి స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ కార్మికులను స్కిల్డ్ కార్మికులుగా మార్పు చేసి వారి వేతనాలను రూ.12,523/- నుండి రూ.15 వేలకు పెంచేందుకు ఆమోదం.

– అన్న‌దాన విభాగంలో 138 మంది క్లీన‌ర్లు, 79 మంది వంట మనుషులను స్కిల్డ్ కేట‌గిరీలోకి మార్చి వారి వేత‌నాలను రూ.17 వేల నుండి రూ.22 వేల‌కు పెంపు.

– ఎల‌క్ట్రిక‌ల్, వాట‌ర్ వ‌ర్క్స్ విభాగాల్లో ప‌నిచేసే కార్మికుల‌ను అన్‌స్కిల్డ్ నుండి స్కిల్డ్ కేటగిరీలోకి మార్పు.

– శ్రీ వెంక‌టేశ్వ‌ర శిల్ప క‌ళాశాల‌లో వివిధ దేవ‌తామూర్తుల శిల్పాల‌ను త‌యారుచేస్తున్న శిల్పుల క‌ళానైపుణ్యాన్ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా, వారి వేత‌నాల పెంపుద‌ల‌కు ఆమోదం.

– క‌లంకారి క‌ళ‌లో నిపుణులైన శ్రీ మున‌స్వామిరెడ్డి వేత‌నం రూ.25 వేల నుండి రూ.39 వేలకు పెంపు.

– టీటీడీ అనుబంధ‌, విలీన ఆల‌యాల్లో విధులు నిర్వ‌హిస్తున్న కాంట్రాక్టు అర్చ‌కులు, సంభావ‌న అర్చ‌కుల వేత‌నాల‌ను రూ.26 వేల నుండి రూ.31 వేల‌కు పెంచేందుకు ఆమోదం.

– టీటీడీ స్టోర్‌లో ప‌నిచేసే 9 మంది వ‌ర్క‌ర్ల‌కు వారి వేత‌నం రూ.9 వేల నుండి రూ.15 వేల‌కు పెంచ‌డం జ‌రిగింది.

– ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ద్వారా సేవ‌లందిస్తున్న క్ర‌మాపాఠీల‌కు రూ.16 వేల నుండి రూ.22 వేల‌కు, ఘ‌నాపాఠీల‌కు రూ.17 వేల నుండి రూ.25 వేల‌కు సంభావ‌న‌ పెంపు.

– అదేవిధంగా, 1400 మంది వేద‌పారాయణదారుల‌కు ప్ర‌స్తుతం ఇస్తున్న పెన్ష‌న్ రూ.10 వేల నుండి రూ.12 వేల‌కు పెంపు.

– హైందవ సనాతన ధర్మప్రచారంలో భాగంగా వేదవిద్యను వ్యాప్తి చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో ఆరు వేద పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలను రూ.35 వేల నుండి రూ.54 వేలకు పెంచేందుకు ఆమోదం.

– టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానికాలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగినంత సిబ్బందితో ఆలయ కైంకర్యాలు తదితర సేవలు నిర్వహించేందుకు నూతన పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వ ఆమోదానికి పంపేందుకు నిర్ణయం.

ఇందులో భాగంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో 227 వేదపారాయణందారు, అధ్యాపక, మేళం సిబ్బంది పోస్టులు, టీటీడీ విలీనం చేసుకున్న ఆలయాల్లో 288 అర్చక, పరిచారిక, పోటు వర్కర్‌, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్‌, వేదపారాయణందారు, మేళం సిబ్బంది పోస్టులు ఉన్నాయి.

– తిరుమలలోని ఆకాశగంగ నుండి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు రూ.30.71 కోట్లతో టెండరు ఆమోదం.

– తిరుమల శ్రీవారి దర్శనానికి దేశవ్యాప్తంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రూ.2.28 కోట్లతో సప్తగిరి సత్రాలు-6, 7 బ్లాకుల అభివృద్ధి పనుల కోసం టెండరు ఆమోదం.

– తిరుమలలోని శ్రీవేంకటేశ్వర, ఆదిశేషు, శంకుమిట్ట విశ్రాంతి గృహాల అభివృద్ధి మరియు పెయింటింగ్‌ పనుల కోసం రూ.10.90 కోట్లు మంజూరుకు పరిపాలన అనుమతికి ఆమోదం.

– ఆకాశరాజు నిర్మించిన అతిప్రాచీనమైన నారాయణవనంలోని శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయానికి రాజగోపురం, రాతిప్రాకారం నిర్మాణానికి రూ.6.90 కోట్లు మంజూరుకు ఆమోదం.

– రాష్ట్ర విభజన అనంతరం, ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లలకు ప్రత్యేకించి వైద్యసేవలు అందించాలన్న ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి సూచనల మేరకు తిరుపతి నగరంలో శ్రీవారి పాదాల చెంత శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడమైనది. భారతదేశంలోనే చిన్నారులకు సంబంధించి ప్రత్యేక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆవిర్భవించనున్న ఈ ఆసుపత్రిని ఇకపై శ్రీ పద్మావతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌ హెల్త్‌గా వ్యవహరించడం జరుగుతుంది.

– టీటీడీ పాలనా వ్యవహారాలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు గాను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఐదేళ్ల కాలపరిమితికి గాను ఓరాకిల్‌ ఫ్యూజన్‌ క్లౌడ్‌ ఇఆర్‌పి ప్రవేశపెట్టేందుకు ఆమోదం.

– తిరుమల అన్నమయ్య భవనం సమావేశ మందిరం ఆధునీకరణలో భాగంగా దృశ్యశ్రవణ అనుసంధాన పరికరాల ఏర్పాటుకు ఆమోదం.

అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన తిరుమల, తిరుపతి మీడియా ప్రతినిధులతో ఏర్పాటైన శ్రీవాణి ట్రస్టు నిజనిర్ధారణ కమిటీ తన నివేదికను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరణాకరరెడ్డికి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డికి అందజేసింది.

ఈ స‌మావేశంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, పలువురు బోర్డు స‌భ్యులు, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం పాల్గొన్నారు.

(టీటీడీ బడ్జెట్ – 2024-25 కాపీ జతపరచడమైనది)

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.