FIRST EDITION OF AYODHYAKANDA AKHANDA PARAYANAM HELD _ రామనామస్మరణతో సాగిన అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 09 July 2023: The first edition of Ayodhya kanda Akhanda Parayanam organised by TTD for the well-being of humanity was held on Sunday on Nada Neeranjanam platform between 7am and 9am and telecasted on SVBC channel.

Vedic pundits from Dharmagiri Veda Vijnan Peetham, SV Vedic University and National Sanskrit University will participate in the program. Acharya Sri Ramanujacharyulu, Acharya Maruti and Acharya Sri Ananta Gopalakrishna of Dharmagiri Peetham rendered Shloka Parayanam of all Shlokas from chapters 1-3 in Ayodhyakanda.

Earlier the Annamacharya Project artist Sri Uday Bhaskar and at the end Sri Nagaraj team from Hyderabad presented melodious Sankeertans.

CEO SVBC Sri Shanmukh Kumar, devotees and others were also present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రామనామస్మరణతో సాగిన అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

తిరుమ‌ల‌, 09 జూలై 2023: తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు ఒకటో విడ‌త అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం భక్తజనరంజకంగా జరిగింది. శ్రీ హనుమత్ సమేత సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం రామనామస్మరణతో సాగింది.

ఇందులో 1 నుండి 3 సర్గల వ‌ర‌కు గ‌ల 156 శ్లోకాలను పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయ‌ణం చేయ‌గా భ‌క్తులు వారిని అనుస‌రించి శ్లోక పారాయ‌ణం చేశారు.

ధర్మగిరి వేద పాఠశాల పండితులు ఆచార్య రామానుజాచార్యులు, శ్రీ అనంత గోపాల కృష్ణ, శ్రీ పివిఎన్ఎన్.మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన పండితులు పాల్గొన్నా‌రు. పారాయణం ప్రారంభానికి ముందు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ ఉదయ్ భాస్కర్ బృందం , చివర్లో హైదరాబాదుకు చెందిన శ్రీ నాగరాజు బృందం భజన కీర్తనలను శ్రవణానందంగా ఆలపించారు.

కార్య‌క్ర‌మంలో ఎస్వీబిసి సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌ ఆచార్య కుప్పా శివసుబ్రమణ్య అవధాని, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.