SET UP HERITAGE CORRIDORS IN SVVU-TTD EO _ వేదవిద్యను ప్రణాళికాబద్దం చేసి అమలుకు చర్యలు – టిటిడి ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి

TIRUPATI, 10 MARCH 2023: The vedic education need to be implemented as per the norms of National Education Policy 2020 from next academic year onwards in Sri Venkateswara Vedic University, said TTD EO Sri AV Dharma Reddy.

 

Reviewing with the vedic varsity offcials in his chambers in TTD Administrative Building in Tirupati on Friday, the EO said, the entire premises of the university should be given an aesthetic look and directed the officials concerned to set up Heritage Corridors related to Vedas, Agamas, Jyothisha etc.and related information need to displayed in these respective corridors. Similarly he also instructed to enhance greenery in the varsity premises.

 

The EO informed the concerned to ensure that the food in hostels be prepared as per Dittam. “The area should reverberate with divine chants of vedic mantras round the clock and the Radio and Broadcasting department of TTD should make necessary arrangements for the same”, he added.

 

Keeping in view the better future and opportunities for vedic students, besides their regular academics, they should be trained in modern languages also. The scanning of two lakhs odd manuscripts need to speed up”, he instructed.

 

JEO (H&E) Smt Sada Bhargavi, Vice Chancellor Sri Rani Sadasivamurthy, Registrar Dr Radhesyam, EE Sri Mallikarjuna Prasad and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

వేదవిద్యను ప్రణాళికాబద్దం చేసి అమలుకు చర్యలు

– వర్శిటీలో వేద, ఆగమ, పౌరోహిత్య హెరిటేజ్ కారిడార్లు ఏర్పాటు

– దైవత్వం ఉట్టిపడేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలి

– టిటిడి ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి

తిరుపతి, 10 మార్చి 2023: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ప్రకారం వేదవిద్యను ప్రణాళికాబద్దం చేసి అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల కార్యాలయంలో ఈవో శుక్రవారం వేద వర్సిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వేదవర్సిటీలో అడుగడుగునా దైవత్వం ఉట్టిపడేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్సిటీ ప్రాంగణంలో వేదిక్ హెరిటేజ్ కారిడార్, ఆగమ, పౌరోహిత్య హెరిటేజ్ కారిడార్లు ఏర్పాటుచేసి ఇందులో వేదాలు, ఆగమాలు, పౌరోహిత్యం తదితర విషయాలపై సమాచారాన్ని ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్సిటీ పచ్చదనం, పరిశుభ్రతతో అలరారే విధంగా అధ్యాపకులు, విద్యార్థులు నడుచుకోవాలని సూచించారు. హాస్టల్లో దిట్టం ప్రకారం తయారుచేసే భోజనం పూర్తి నాణ్యతగా ఉండేలా ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

బ్రాడ్ కాస్టింగ్ ద్వారా నిత్యం వేదమంత్రాలు వినిపించేలా వర్సిటీ ప్రాంగణంలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పాఠ్యాంశాలకు సంబంధించి మరింత ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నిత్య అనుష్తానం కోసం ప్రత్యేకంగా వేదికతో కూడిన సభాస్థలి ఏర్పాటు చేయాలన్నారు. వేదాల రికార్డింగ్ కోసం వేద రికార్డింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేదాల సారాన్ని భవిష్యత్తు తరానికి అందించేందుకు మరింత లోతుగా పరిశోధనలు చేయాలని సూచించారు. విద్యార్థులకు సాంప్రదాయ సబ్జెక్టులతో పాటు మోడ్రన్ లాంగ్వేజెస్ బోధించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అందుబాటులో ఉన్న దాదాపు రెండు లక్షల పైచిలుకు రాతప్రతుల స్కానింగ్ పనులను ఎస్వీ మాన్యుస్క్రిప్ట్ ప్రాజెక్ట్ ద్వారా వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఈ సమీక్షలో టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, రిజిస్టార్ డా.రాధేశ్యామ్, ఇఇ శ్రీ మల్లికార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.