PADMAVATI SHINES IN VAIKUNTANATHA ALANKARAM ON PEDDA SESHA VAHANA _ పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి

Tirupati, 1 Dec. 21: On the second day of the ongoing annual Karthika Brahmotsavam of Sri Padmavati ammavari temple, Tiruchanoor, goddess blessed devotees in Vaikuntanatha alankaram on Peddasesha vahana.

The event on Wednesday morning was held in ekantha inside the temple premises in view of covid guidelines at the vahana mandapam between 08-09.00 am.

The seven-hooded Pedda Sesha, an ardent disciple of Sri Venkateswara serves as the throne of Padmavati, the favourite queen of Sri Venkateswara.

Legends say that Goddess darshan on Pedda Sesha vahana, king of serpents, begot all Yoga Shakti to devotees. 

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, TTD Board Member Sri Chavireddy Bhaskar Reddy, JEO Sri Veerabrahmam, Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, Temple archaka Sri Babu Swamy, Temple inspector Sri Rajesh and other officials were present.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి
 
 
తిరుపతి, 2021 డిసెంబరు : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠ‌నాథుని(శ్రీ మహావిష్ణువు) అలంకారంలో శంకుచ‌క్రాలు, గ‌దతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
 
 
శ్రీ పద్మావతి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవ దర్శనం వల్ల యోగశక్తి కలుగుతుంది.
 
 
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ శేషగిరి, ఏవిఎస్వో శ్రీ వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.