SERVE VAIKUNTA EKADASI DEVOTEES WELL, ADDITIONAL EO TO KALYANA KATTA BARBERS _ వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భ‌క్తుల‌కు చ‌క్క‌టి సేవ‌లందించాలి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 30 Dec. 19: TTD Additional Executive Officer Sri A V Dharma Reddy exhorted that the barbers of Kalyana Katta to provide hassle free and quality, service to all devotees coming for Vaikunta Ekadasi day and bring laurels to TTD.

Addressing them at the Asthana Mandapam on Monday evening during an orientation program he said the barbers had rendered stellar service and earned laurels during the recent Srivari Brahmotsavams. 

They should exhibit similar commitment and dedication in serving the devotees till January, as Govindamala and Ayyappamala devotees will throng till month end.

The Additional EO said next to Srivari temple, the Kalyana Katta was equally revered location inTirumala. 

Kalyanakatta DyEO Smt Nagaratna, AEO Sri Jaganmohanachary and KKC barbers were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

 

వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భ‌క్తుల‌కు చ‌క్క‌టి సేవ‌లందించాలి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల,  2019, డిసెంబ‌రు 30: వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం విశేషంగా విచ్చేసే భ‌క్తుల‌కు క‌ల్యాణ‌క‌ట్ట క్షుర‌కులు చ‌క్క‌టి సేవ‌లందించి సంస్థ‌కు మంచిపేరు తీసుకురావాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో సోమ‌వారం సాయంత్రం క‌ల్యాణ‌క‌ట్ట క్షుర‌కుల‌కు అవ‌గాహ‌న స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది జ‌రిగిన శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో క‌ల్యాణ‌క‌ట్ట క్షుర‌కులు చ‌క్క‌గా త‌ల‌నీలాలు తీసి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ప‌నిచేశార‌ని కొనియాడారు. అదేస్ఫూర్తితో జ‌న‌వ‌రి 1 నుండి 20వ తేదీ వ‌ర‌కు భ‌క్త‌కోటికి సేవ‌లందించాల‌ని కోరారు. జ‌న‌వ‌రి 1న నూత‌న ఆంగ్ల సంవ‌త్స‌రాది, జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న ద్వాద‌శికి పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తార‌ని, సంక్రాంతి సెల‌వుల్లో జ‌న‌వ‌రి 8 నుండి 20వ తేదీ వ‌ర‌కు అయ్య‌ప్ప‌స్వామి భ‌క్తుల ర‌ద్దీ ఉంటుంద‌ని వివ‌రించారు. టిటిడిలో శ్రీ‌వారి ఆల‌యం త‌రువాత అత్యంత ముఖ్య‌మైన విభాగం క‌ల్యాణ‌క‌ట్ట అని తెలియ‌జేశారు. గ‌త బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా అందించిన విధంగానే వైకుంఠ ఏకాద‌శికి కూడా పురుషుల‌కు రెండు ష‌ర్టులు, రెండు పంచ‌లు, మ‌హిళ‌ల‌కు రెండు చీర‌లను దాత స‌హ‌కారంతో త్వ‌ర‌లో అందిస్తామ‌ని వెల్ల‌డించారు. క‌ల్యాణ‌క‌ట్ట క్షుర‌కులు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నారని, భ‌గ‌వంతుని ఆశీస్సులు త‌ప్పకుండా ఉంటాయ‌ని న‌మ్ముతున్నాన‌ని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి క‌ల్యాణ‌క‌ట్ట డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ జ‌గ‌న్మోహ‌నాచారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.