వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్ల విడుదల వివరాలు
వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్ల విడుదల వివరాలు
నవంబర్ 28న శ్రీవాణి టికెట్లు, 30న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
డిసెంబర్ 1 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల ఈ–డిప్ నమోదు
తిరుమల, 2026 నవంబర్ 27: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వివిధ దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
• నవంబర్ 28: ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదల.
• నవంబర్ 30: ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల.
• డిసెంబర్ 1 నుంచి 5 వరకు: ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు ఈ-డిప్లో నమోదు చేసుకోవచ్చు.
• డిసెంబర్ 7: మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కేటాయింపు.
• డిసెంబర్ 8: ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా టికెట్ల విడుదల.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగింది. ఈ రెండు రోజుల్లో అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ-డిప్ విధానం ద్వారా ఆన్లైన్లో కేటాయించనున్నారు.
అలాగే, ఈ రెండు రోజులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా రద్దు చేయడం జరిగింది.
భక్తులు దర్శన టికెట్లు, టోకెన్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది
