KALYANA VENKANNA GARUDA SEVA HELD _ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ

RELIGIOUS EXTRAVAGANZA MARKS

TIRUPATI, 15 FEBRUARY 2023: The pleasant evening on Wednesday witnessed utmost religious fervour at Srinivasa Mangapuram with Sri Kalyana Venkateswara atop mighty Garuda Vahanam sitting majestically blessing His devotees.

The four mada streets surrounding the temple were filled with devotees who waited with eagerness and enthusiasm to catch a glimpse of Lord on His favorite carrier as religious splendour and extravaganza marked the entire event.

The performances by cultural troupes, colourful floral and light decorations enhanced the grandeur of Garuda Seva.

TTD board members Sri Bhaskar Reddy, Sri Ashok Kumar, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam,, Spl Gr DyEO Smt Varalakshmi, VGOs Sri Manohar, Sri Bali Reddy and other officers were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ

తిరుపతి, 2023 ఫిబ్రవరి 15: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది.
స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారులవాయిద్యాలు , మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.

వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది.

ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు , టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి , వీజీవోలు శ్రీ మనోహర్, శ్రీ బాలి రెడ్డి,ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్‌
శ్రీ చెంగ‌ల్రాయులు, కంకణ భట్టర్ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి , ఆలయ అర్చకులు విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.