ANNUAL VASANTHOTSAVAMS COMMENCES IN SRINIVASA MANGAPURAM _ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం 

TIRUPATI, 10 MAY 2023: The annual Vasanthotsavams commenced on a grand religious note in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on Wednesday near Tirupati.

 

The Snapana Tirumanjanam to the Utsava deities of Sri Bhu sameta Sri Kalyana Venkateswara was rendered between 2pm and 4pm followed by Unjal Seva. 

On May 11, the procession of Swarna Ratham will take place between 6pm and 7pm.

 

TTD has canceled Arjita Kalyanotsavam owing to this three-day annual fete till May 12.

 

Special Grade DyEO Smt Varalakshmi, Archaka Sri Balaji Rangacharyulu, AEO Sri Gurumurthi, Superintendents Sri Chengalrayalu, Sri Venkataswamy, and other temple staff, devotees participated.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2023 మే 10: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహ‌స్ర‌నామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంతమండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.

మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

మే 11న స్వర్ణరథోత్సవం

మే 11వ‌ తేదీ గురువారం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరుగనుంది. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూప‌రింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీ ధన శేఖర్, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.సవాలు