KOIL ALWAR TIRUMANJANAM PERFORMED AT SRI KODANDARAMA SWAMY TEMPLE _ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, November 06, 2026: Koil Alwar Tirumanjanam was performed with devotion at Sri Kodandarama Swamy Temple in Tirupati on Friday, ahead of the Deepavali Asthanam scheduled for November 8.
The temple was thoroughly cleaned from 7 am to 9.30 am. The walls, ceilings and puja materials were purified with a sacred mixture of turmeric, kumkum, sandalwood and other fragrant ingredients. Sarva Darshan resumed at 10.30 am.
Temple Deputy EO Smt. Nagaratna, AEO Smt. Kumaridevi, Superintendent Sri Srinivasulu Reddy and temple priests participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, నవంబరు 06, 2026: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నవంబరు 8న నిర్వహించనున్న దీపావళి ఆస్థానాన్ని పురస్కరించుకుని శుక్రవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆలయ గోడలు, పైకప్పులు, పూజా సామగ్రిని శుభ్రపరిచి, పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం తదితర సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర పరిమళ మిశ్రమాన్ని ఆలయంలో పూశారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ కుమారి దేవి, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.






