ANKURARPANAM HELD _ శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tirupati, 28 February 2024: Ankurarpanam was observed in Sri Kalyana Venkateswara Swamy temple as a prelude to annu Brahmotsavam on Wednesday evening.

On the occasion in the morning, Koluvu and Panchanga Shravana were performed.

From 6pm to 8pm, after Punyahavachanam, Mritsangrahanam and Senadhipati Utsavam, the seed-sowing ritual was conducted.

Spl Gr Deputy EO of Smt Varalakshmi, AEO Sri Gopinath, Superintendent Sri Chengalrayulu, Temple Inspector Sri. Kiran Kumar Reddy, temple priests and other officials participated in this program.

Garuda Flag hoisting on February 29

The Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy will begin on February 29 with the ceremonious ritual of Garuda flag hoisting. 

As part of this, Trichy Utsavam will be held between 6.30 am to 8.30 am to the idols of Swami and Ammavarlu. 

Between 8.40 am and 9 am, the flag hoisting ceremony will be held traditionally in the auspicious Meenalagnam. 

On the same day, Unjal Seva will be held from 5pm to 6pm and Peddashesha Vahanaseva will be held between 7pm to 8 PM.

The vahana sevas will be observed between 8 am and 9 am and again from 7 pm to 8 pm everyday. Garuda Seva is on March 4.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 2024 ఫిబ్ర‌వ‌రి 28: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు బుధ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

అంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్‌ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 29న ధ్వజారోహణం :

ఫిబ్రవరి 29వ తేదీ ధ్వజారోహణంతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 8.40 నుండి 9 గంటల మధ్య మీన‌ల‌గ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.

ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

29-02-2024

ఉదయం – ధ్వజారోహణం(మీన‌ల‌గ్నం)

రాత్రి – పెద్దశేష వాహనం

01-03-2024

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

02-03-2024

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

03-03-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

04-03-2024

ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)

రాత్రి – గరుడ వాహనం

05-03-2024

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – స్వర్ణరథం,

రాత్రి – గజ వాహనం

06-03-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

07-03-2024

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

08-03-2024

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.