PAVITRA SAMARPANA HELD AT SRI PADMAVATHI AMMAVARI TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
Tirupati, September 25, 2026: As part of the ongoing annual Pavitrotsavams at Tiruchanoor Sri Padmavathi Ammavari Temple, Pavitra Samarpana was performed as per Agama traditions on Friday.
After Suprabhatham, Sahasranamarchana and Nityarchana were performed. Pavitrams were then offered to the presiding deity, processional deities, sub-shrines, Parivara Devatas, Vimana Prakaram and Dhwajasthambham.
TTD JEO Dr. A. Sharath, Chandragiri MLA Sri Pulivarthi Nani, temple officials, priests and devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
తిరుపతి, 2026 సెప్టెంబరు 25: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది.
ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పవిత్ర సమర్పణ చేపట్టారు.
ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తి, ఉత్సవమూర్తులు, ఉప ఆలయాలు, పరివార దేవతలు, విమాన ప్రాకారం, ధ్వజస్తంభానికి పవిత్రాలను సమర్పించారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, ఏవీఎస్వో శ్రీ శ్రీహరిరావు, సూపరింటెండెంట్లు శ్రీ సురేష్, శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ లక్ష్మీకాంతం, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.










