శ్రీకపిలేశ్వరస్వామి ఉన్నత పాఠశాల ద్వితీయ వార్షికోత్సవము

శ్రీకపిలేశ్వరస్వామి ఉన్నత పాఠశాల ద్వితీయ వార్షికోత్సవము

తిరుపతి, ఏప్రిల్‌ -19, 2011: చంద్రగిరి స్థానిక వెంకటపతినగర్‌లో గల తిరుమల తిరుపతి దేవస్థానముల వారి శ్రీకపిలేశ్వరస్వామి ఉన్నతపాఠశాల ద్వితీయ వార్షికోత్సవము మంగళవారం కన్నుల పండుగగా జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా ప్రొ. పి.వి. అరుణాచలం గారు విశ్రాంతి ఉపకులపతి ద్రవిడ విశ్వవిద్యాలయము కుప్పం. సారస్వత అతిధిగా తిరుమల తిరుపతి దేవస్థానముల విద్యాశాఖాధికారి డాక్టర్‌ నండూరి విద్యారణ్యస్వామి గారు విచ్చేసినారు.

ముఖ్య అతిధి అయిన శ్రీ అరుణాచలం మాట్లాడుతూ తిరుపతి మహా పుణ్యక్షేత్రమని, ఇక్కడే శంకరబాడి సుందరాచారి గారు జన్మించి మంచి గురువుగా, కవిగా, రచయితగా కీర్తి ప్రతిష్ఠలు పొందినారని ఆయన శిష్యరికం నాకెంతో ఆనందాన్నిచ్చినదని తన జ్ఞాపకాలను గుర్తుచేసుకొన్నారు. పిల్లల భవిష్యత్తులో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కీలక పాత్ర వహించాలని సూచించారు. తితిదే విద్యాశాఖాధిగారు జనని సంస్కృతంబు సర్వభాషలకెల్ల అని చెబుతూ వేదాల మహత్యాన్ని వివరించినారు. పిల్లలందరూ బాగా చదవాలని వారికి ఆశీస్సులు అందించినారు.

సంగీత, వ్యాసరచన, ఆటలపోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను అందజేసినారు. ఈ కార్యక్రమమునకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి.కిషన్‌ గారు అధ్యక్షత వహించినారు. చివరగా సాంస్కృతిక కార్యక్రమములు జాతీయ గీతముతో సభ విజయవంతముగా జరిగినది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.