EKANTHA VANA BHOJANAM AT SRI KVT _ శ్రీ‌నివాస‌మంగాపురంలో ఏకాంతంగా కార్తీక వ‌న‌భోజ‌నం

Tirupati, 1 Dec. 21: As part of Karthika masa festivities, the TTD organised Ekantha Vana Bhojanam fete at TTD Sub temple, Sri Kalyan Venkateshwara temple, Srinivasa Mangapuram on Wednesday afternoon as per covid guidelines.

Earlier the utsava idols of Sri Bhudevi, Sri Devi sameta Sri kalyan Venkateswara were seated at the Kalyan Mandapam offered Snapana Thirumanjanam and Asthanam.

Thereafter the fete of Karthika Vana Bhojanam was conducted within the temple premises.

Temple DyEO Smt Shanti, Superintendent Sri Ramanaiah and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ‌నివాస‌మంగాపురంలో ఏకాంతంగా కార్తీక వ‌న‌భోజ‌నం

తిరుప‌తి, 2021 డిసెంబ‌రు 01: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధ‌వారం కార్తీక వనభోజన కార్యక్రమం జ‌రిగింది. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పానికి వేంచేపు చేశారు. స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత ఆస్థానం, వ‌న‌భోజ‌నం కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య‌ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మ‌ణ‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.