COMPLETE SRINIVASA SETHU WORKS ON WAR FOOTING- TTD EO _ శ్రీనివాస సేతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : టిటిడి ఈఓ శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి

Tirupati,13 December 2022: TTD EO Sri AV Dharma Reddy has directed officials to expedite all works on the Srinivasa Sethu project by end of January 2023.

 

Addressing a review meeting at the TTD administrative building along with Tirupati Municipal Commissioner Kumari Anupama Anjali the EO said 85% of works on the Sethu project were completed but for the third phase work of 60 meter steel girder installation to be readied by January 31.

 

Among others, the progress of pending works including Decks Lab works,  exit roads towards Ramanuja circle, MS Subbulakshmi circle, Renigunta road and Tiruchanoor roads also discussed. Similarly, he instructed that the pavement for pedestrians and drain sluices need to be finished.

 

TTD EO directed the project company manager Sri Rangaswami of AFCON to deploy additional staff if needed to complete works on schedule.

 

TTD JEOs Sada Bhargavi, Sri Veerabrahmam, FA & CAO Sri O Balaji,CE Sri Nageswara Rao, Municipal SE Sri Mohan, Tirupati Smart City Corporation GM Sri Chandramouli and others were present.

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీనివాస సేతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : టిటిడిఈఓ శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి


తిరుపతి, 2022 డిసెంబ‌రు 13: శ్రీనివాస సేతు పనులు త్వరగా పూర్తి చేయాలని టిటిడి ఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలో మంగళవారం తిరుపతి మున్సిపల్ కమిషనర్ కుమారి అనుపమ అంజలితో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీనివాస సేతు పనులు ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మూడవ దశలో నిర్మాణంలో ఉన్న దాదాపు 60 మీటర్ల స్టీల్ గర్డర్ లను జనవరి 31వ తేదీకి నాటికి ఏర్పాటు చేయాలన్నారు.

డెక్స్ ల్యాబ్ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రామానుజ సర్కిల్ వైపు, సుబ్బలక్ష్మి విగ్రహం వైపు, రేణిగుంట రోడ్డు వైపు, తిరుచానూరు రోడ్డు వైపు జరుగుతున్న పనులపై సమీక్షించారు . అదేవిధంగా పాదాచారులు నడిచేందుకు అనువుగా పేవ్ మెంట్ , కాలువలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. నిర్ణీత సమయంలో శ్రీనివాస సేతు పనులు పూర్తి చేసేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సంస్థ మేనేజర్ శ్రీ రంగస్వామిని ఆదేశించారు.

ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ ఎ అండ్ సీ ఏవో శ్రీ బాలాజీ, సి ఇ శ్రీ నాగేశ్వరరావు, మున్సిపల్ ఎస్ ఇ శ్రీ మోహన్, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ జిఎం శ్రీ చంద్రమౌళి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.