DENIZENS ADORES ABHISHEKA SEVA _ శ్రీవారి అభిషేక సేవతో పులకించిన హైదరాబాద్ భక్తజనం

HYDERABADIS GRIPPED IN DEVOTIONAL FERVOUR

HYDERABAD, 14 OCTOBER 2022: The fourth day of ongoing Sri Venkateswara Vaibhavotsavams at NTR Stadium in Hyderabad witnessed a sea of humanity for Abhisheka Seva performed to Mula Virat of Sri Venkateswara Swamy on Friday.

The denizens of Hyderabad are immersed in the ocean of devotion on witnessing making use of the rarest of the rare divine opportunity of taking part in the Abhisheka Seva with utmost religious ecstasy.

In Tirumala on every Friday after Suprabhatha Seva, the regular Thomala and Archana Sevas are done in privacy and then Srivari Abhishekam is observed. This happens to be the most ancient Arjitha Seva that is being observed in the hill shrine of Lord Venkateswara. The same was replicated in Hyderabad.

The Abhishekam started with holy waters followed by milk, then with curd, sandal, turmeric and other scented articles like powdered Pachcha Karpooram, Saffron paste.

While performing the Abhishekam to the Moola Virat, Purshasukta, Narayanasukta, Srisukta, Bhusuktha, Neelasuktha and selected Pasurams from the Divya Pradbandham were all recited by the Veda Parayanamdars. Later, the Abhishekam was performed for the image of Goddess Lakshmi on his chest with Turmeric Paste.

Historical Significance

Pallava Queen “Samaavai” gifted the present silver idol of Bhoga Srinivasa  Murthy to the temple about 1500 years ago. This idol is exact miniature replica of the Mula Virat. The year when she gifted, it was on Jyestha Bahula Tritheeya when Sravana star was in the ascendant in Akshya Year and it was on Friday.

While installing the Bhoga Srinivasa Murthy idol in the Sanctum, an Abhishekam was performed to the main deity also. Thus, started the practice of doing Abhishekam to Moola Virat on every Friday.

The devotees who thronged the spacious stadium were thrilled to see the holy bath rendered to Sri Venkateswara. The ritual took between 8:30am and 10am.

PUSTAKA PRASADAM

The Hindu Dharma Prachara Parishad wing of TTD has distributed books on Sro Venkateswara Suprabatham, Govinda Namalu to devotees.

One of the Chief Priests of Tirumala Temple Sri Venugopala Deekshitulu, Agama Advisor Sri Mohana Rangacharyulu, Rajyasabha MP Sri Vemireddi Prabhakar Reddy, New Delhi LAC Chief Smt Prasanthi Reddy, donors Sri Harshavardhan, Sri SS Reddy, Sri Venkateswar Reddy, Sri Subba Reddy, Deputy EO of Tirumala temple Sri Ramesh Babu, All Dharmic Projects of TTD Programme Officer Smt Vijayalakshmi, Annamacharya Project Director Dr Vibhishana Sharma, AEOs Sri Jaganmohanachary, Sri Parthasaradhi, Sri Sriramulu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి అభిషేక సేవతో పులకించిన హైదరాబాద్ భక్తజనం

హైదరాబాద్, 2022 అక్టోబరు 14: హైదరాబాద్‌లో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీవారికి  అభిషేక సేవ నిర్వహించారు. స్వామి వారికి జరిగిన అభిషేక సేవను దర్శించిన భక్తులు పులకించిపోయారు. 

శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు అభిషేకం నిర్వహించారు .

అభిషేకం ప్రాశస్యం 

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం చేస్తారు.

భగవద్రామానుజుల వారు శ్రీస్వామివారి వక్షఃస్థలంలో ”బంగారు అలమేలుమంగ” ప్రతిమను అలంకరించిన శుక్రవారం నాటితో మొదలుపెట్టి ప్రతి శుక్రవారం అభిషేకం జరిగేలా ఏర్పాటుచేశారట. పునుగు, కస్తూరి, జవ్వాది తదితర సుగంధ పరిమళాలతో కూడిన పవిత్రజలాలతో సుమారు గంట పాటు అభిషేకం జరుగుతుంది.

ఆ తర్వాత పసుపుతో శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న మహాలక్ష్మికి కూడా అభిషేకం చేస్తారు.

శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని వక్షఃస్థల లక్ష్మితో కలిసి ఈ శుక్రవారాభిషేక సమయంలో మాత్రమే దర్శించేందుకు వీలవుతుంది. స్వామి వారి భక్తులు జీవితంలో ఒక్కసారైనా అభిషేకం చూసి తరించాలనుకుంటారు. ఇలాంటి భక్తుల కోరిక తీరుస్తూ హైదరాబాదులో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం భక్తులందరిపై తీర్థాన్ని సంప్రోక్షించడంతో అభిషేక దర్శనం ముగిసింది.

అనంతరం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిజపాదదర్శనం కల్పించారు. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు అర్చన, రెండో నివేదన, శాత్తుమొర చేపట్టారు. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7.30 గంటల వరకు  భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

భక్తులకు పుస్తక ప్రసాదం

టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులందరికీ శ్రీ వేంకటేశ సుప్రభాతం, గోవిందనామాలను పుస్తక ప్రసాదంగా అందజేశారు. గ్యాలరీల్లోని భక్తులు గోవిందనామాలు పఠిస్తూ స్వామివారి సేవలను దర్శించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, బోర్డు సభ్యులు శ్రీ రాములు, దాతలు శ్రీ హర్షవర్ధన్‌, శ్రీ ఎస్‌ఎస్‌.రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీ సుబ్బారెడ్డి, విజివో శ్రీ మనోహర్, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీమతి విజయలక్ష్మి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ, ఏఇఓలు శ్రీ జగన్మోహనాచార్యులు, శ్రీ పార్థసారథి, శ్రీ శ్రీరాములు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.