PARUVETA UTSAVAM HELD IN EKANTAM _ శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం

Tirumala, 16 Jan. 22: The Paruveta Utsavam was observed in Ekantam in Tirumala temple on Sunday evening.

 

Due to Covid restrictions, this festival of mock hunt took place in Kalyanotsava Mandapam.

 

The processional deities of Sri Malayappa and Sri Krishna Swamy were brought from Srivari temple to Kalyanotsavam Mandapam.

 

After rendering Vedic hymns, Annamacharya kritis and Harikatha, the priests on behalf of Sri Malayappa performed the mock hunt by throwing the weapon on to the wild beasts thrice.

 

The Garden wing of TTD has recreated a forest set up with wild animals to match the occasion.

 

Later the deities were taken back to the temple.

 

Additional EO Sri AV Dharma Reddy and temple officials were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం

తిరుమ‌ల‌, 2022 జనవరి 16: తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాదీ కనుమ పండుగనాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా మ‌ధ్యాహ్నం 3 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని, శ్రీ కృష్ణ స్వామివారిని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఊరేగించి, క‌ల్యాణ‌మండ‌పంలో ఆస్థానం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు, హరికథ పారాయణం నిర్వహించారు. టిటిడి గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో అడవిలో ఉండే విధంగా పులులు ఇతర క్రూర జంతువుల సెట్టింగ్ లు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు మూడు సార్లు స్వామి వారి తరపున ఈటెను విసిరి పార్వేట ఉత్సవం నిర్వహించారు.

అనంత‌రం స్వామివారు తిరిగి ఆల‌యానికి చేరుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.