EX-BOARD MEMBERS OF TTD SHOULD FOLLOW THE RULES FOR DARSHAN OF SRIVARU _ శ్రీవారి దర్శనానికి టీటీడీ మాజీ బోర్డు సభ్యులు నిబంధనలు పాటించాలి

Tirumala, 11 March 2024: TTD Chairman Sri Bhumana Karunakar Reddy said that the board has given opportunity to the former members of the TTD Board to have darshan of Srivaru with their family members (wife, children, mother and father alone) only for a few times in a year.

However, he said that some of the former board members are often seen violating this rule by bringing others along with them other than their family members for darshan of Srivaru frequently. 

He said the former board members should follow the guidelines otherwise will not be allowed to have darshan of Srivaru if they bring others along with them instead of their family members.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీవారి దర్శనానికి టీటీడీ మాజీ బోర్డు సభ్యులు నిబంధనలు పాటించాలి

తిరుమల, 2024, మార్చి 11: టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే వారి కుటుంబ సభ్యులతో (భార్య, పిల్లలతో , తల్లి తండ్రి ) శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం బోర్డు కల్పించిందని టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.

అయితే కొందరు మాజీ బోర్డు సభ్యులు ఈ నిబంధనకు విరుద్ధంగా తమ కుటుంబ సభ్యులతో కాకుండా ఇతరులను వెంట బెట్టుకొని శ్రీవారి దర్శనం కొరకు పదే పదే రావడం మంచి పద్ధతి కాదని ఆయన ఆన్నారు. మాజీ బోర్డు సభ్యులు ఆ హోదాలో కేవలం వారి కుటుంబ సభ్యులతో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలే తప్ప, ఇతరులను వెంట బెట్టుకుని వస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవారి దర్శనానికి అనుమతించేది లేదని ఆయన అన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.