శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల 50వ సంతాలను పూర్తి -ప్రన్సిఫాల్‌ ఆరివేటి ప్రభావతి

శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల 50వ సంతాలను పూర్తి -ప్రన్సిఫాల్‌ ఆరివేటి ప్రభావతి

 తిరుపతి,  2010 జనవరి 08: తిరుమల తిరుపతి దేవస్థానముల సహాయ సహకారాలవలనే శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల 50వ సంతాలను పూర్తి చేసుకొని స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకొనుచున్నదని కళాశాల  ప్రిన్సిపాల్ శ్రీ‌మ‌తి ప్రభావతి అన్నారు.

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం అఫిలియేషన్‌తో భారత సనాతన సంప్రదాయ, సంగీత, నృత్య హరికథలను దక్షిణ భారతదేశంలో గొప్పగా తితిదే ద్వారా చేయాలనే సంకల్పంతో ఈ కళాశాల ప్రారంభమయింది. 1959 సంవత్సరం నుంచి 2009 వరకు ఎన్నో విధాల శాఖోపశాఖలుగా విస్తరించి 5 మంది అధ్యాపకులు, 10 మంది విద్యార్థుల స్థాయి నుండి నేడు 50 మంది అధ్యాపకులు 500 మంది విద్యార్థులు స్థాయికి ఎదిగి సాంస్కుృతిక కళా కేంద్రంగా విరాజిల్లుతోంది. దక్షిణ భారత దేశానికే ఈ ఎస్‌.వి. సంగీత కళాశాల తలమానికంగా నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు.

 తితిదే సహకారంతో స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయంగా ఎదగడానికి అడుగు దూరంలో వున్నది. ఈ కళాశాలలో విధ్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు నేడు గొప్ప కళాకారులుగా పేరు పొందుతూ భారతీయ సంగీతాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాప్తి చేస్తున్నారు. స్వర్ణోత్సవాలలో భాగంగా 4వ రోజైన శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రముఖ కళాకారులు ముంబైకి చెందిన గిరిజావేషమాంబ గారి గాత్ర కచేరి సంగీత ప్రియులను మైపరపించింది.

 అదేవిధంగా  సాయంత్రం 4 గంటలకు మునిరత్నంగారి నాదస్వరం ఆకట్టుకొంది. 6.30 గంటలకు ప్రముఖ విద్వాంసులకు సన్మాన కార్యక్రమం జరిగింది. చివరగా ప్రముఖ సినీనటుడు వినీత్‌ నృత్యం ప్రేక్షకులను అలరించింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.