TEMPLE DOORS OPENED AFTER CHOODAMANI SURYA GRAHANAM _ శ్రీ‌వారి ఆల‌యంలో కైంక‌ర్యాలు ప్రారంభం

Tirumala, 21 Jun. 20: After the completion of solar eclipse on Sunday, the temple doors of Tirumala were reopened followed by Suddhi and Punyahavachanam.

Suprabhata seva commenced at 2:30pm and other series of rituals observed till 6pm. Again from 7pm onwards the evening sevas were performed followed by Ekanta Seva at 8:30pm.

TTD has dispensed with darshan for pilgrims on Sunday. The darshan will resume as usual from Monday onwards in allotted time slots.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో కైంక‌ర్యాలు ప్రారంభం

తిరుమ‌ల‌, 2020 జూన్ 21: శ్రీ‌వారి ఆల‌యం త‌లుపులు ఆదివారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు తీసి శాస్త్రోక్తంగా స్వామివారి కైంక‌ర్యాలు ప్రారంభించారు. సూర్యగ్రహణం కారణంగా శ‌ని‌వారం రాత్రి 8.30 గంట‌లకు ఆల‌య తలుపులు మూసిన విష‌యం విదిత‌మే.

ఆదివారం ఉదయం 10.18 గంట‌లకు ప్రారంభ‌మైన సూర్యగ్రహణం మ‌‌ధ్యాహ్నం 1.38 గంట‌లకు ముగిసింది. ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఆదివారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో సుప్ర‌‌భాతం, ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, ఇత‌ర నిత్య కైంక‌ర్యాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించి భ‌క్తుల‌కు ద‌ర్శనం ర‌ద్ధు చేశారు.

కాగా జూన్ 22వ తేదీ సోమ‌వారం ఉద‌యం నుండి భ‌క్తుల‌ను వారికి కేటాయించిన స‌మ‌యాల‌ల్లో శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ‌వారి ఆల‌య ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి త‌దితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.