“NO CHANGES IN RITUALS AT SRIVARI TEMPLE “- CHIEF PRIEST SRI VENUGOPAL DIKSHITULU _ శ్రీ‌వారి ఆల‌యంలో నైవేద్య వేళ‌ల్లో ఎలాంటి మార్పు లేదు

Tirumala, 5 Apr. 20 ; One of the Chief Priests of Tirumala Temple Sri Venugopal Dikshitulu asserted that there is no change or deviation in the rituals and timings at the Srivari temple during the ongoing annual Vasanthotsavam festival.

Refuting social media reports that there was a break in traditions in offering Naivedyam to lord during Vasantotsavam,  he said it is totally baseless.

The chief priest narrated the course of events performed inside the temple. After Naivedyam first bell between 5:30am and 6am, second bell between 6am and 7am, the deities are brought to Kalyanotsava Mandapam in Sampangi Prakaram and rituals are conducted.

“In view of COVID 19 restrictions, instead of performing Vasanthotsavam at Vasantha Mandapam, this year we are doing it in Kalyanotsavam Mandapam under the supervision of Jeeyar Swamis, Agama advisors and main archakas without any deviation”, he asserted.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో నైవేద్య వేళ‌ల్లో ఎలాంటి మార్పు లేదు
 
గ‌త సంవ‌త్స‌రాల త‌ర‌హాలోనే వ‌సంతోత్స‌వాలు : శ్రీ‌వారి ఆల‌య ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు
 
ఏప్రిల్ 05, తిరుమల, 2020: వ‌సంతోత్స‌వాల సంద‌ర్భంగా గ‌త సంవ‌త్స‌రాల త‌ర‌హాలోనే నైవేద్య వేళ‌ల‌ను పాటించామ‌ని, ఎలాంటి మార్పు లేద‌ని శ్రీ‌వారి ఆల‌య ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు తెలిపారు.

తిరుమ‌ల‌లో ఆదివారం శ్రీ వేణుగోపాల దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ స్వామివారికి ఉదయం నైవేద్యం, మధ్యాహ్న నైవేద్యం వెనువెంటనే పెట్టారని, ఇది అపచారమని సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, ఇది శోచనీయమని అన్నారు. తద్వారా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు.

ప్రతి ఏడాదీ వసంత మండపంలో వసంతోత్సవాలు జరుగుతాయని, ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఏకాంతంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వివరించారు. వసంతోత్సవం నేపథ్యంలో గత సంవత్సరాల్లో జరుగుతున్న విధంగానే ఉదయం 5.30 నుండి 6 గంటల మధ్యలో మొదటి గంట నైవేద్యం, ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో రెండో గంట నైవేద్యం సమర్పించామని, ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు. ఉదయం 7 గంటలకు సంపంగి ప్రాకారంలోని కళ్యాణమండపానికి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేశామని, అక్కడ ఆస్థానం, స్నపన తిరుమంజనం అనంతరం సాయంత్రం 5 గంటలకు విమానప్రదక్షిణగా స్వామి, అమ్మవార్లు సన్నిధికి చేరుకుంటారని తెలియజేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.