SOMA SKANDA RIDES BHOOTA _ భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి

Tirupati, 24 Feb. 22: Sri Somaskanda Murty accompanied by Sri Kamakshi Devi, seated on Bhoota Vahanam blessed devotees at Sri Kapileswara Swamy temple.

On the third day of ongoing Brahmotsavams in Ekantam, Bhoota Vahanam took place.

Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 24: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన గురువారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా భూత వాహనంపై అభ‌య‌మిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న సేవ ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

పూర్వం క్రూరభూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు ఆ భూతాల నుంచి లోకాలను కాపాడమని వేడుకున్నారు. ఈ కార్యానికి నిర్జన ప్రదేశాలైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు. భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మసృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి ”భూతపతి”గా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని భక్తుల విశ్వాసం. అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై అభయమిచ్చాడు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.