ANNABHISHEKAM HELD _ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘ‌నంగా అన్నాభిషేకం

TIRUPATI, 28 OCTOBER 2023: The Annabhishekam ritual was held in a ceremonious manner at Sri Kapileswara Swamy temple in Tirupati on Saturday.

In the afternoon, the devotees were allowed for darshan. Later in the evening Annalinga Udhwasana was held in Ekantam followed by Suddha Dravyabhishekam in Ekantam.

Following the partial lunar eclipse during the wee hours on October 29, the temple doors will be closed by 6:45pm and reopened on Sunday at 4am.

After performing Suddhi rituals darshan will be provided to devotees on October 29.

DyEO Sri Devendra Babu, AEO Sri Subba Raju, Superintendent Sri Bhupati and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘ‌నంగా అన్నాభిషేకం

తిరుపతి, 2023 అక్టోబ‌రు 28: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం అన్నాభిషేకం వైభ‌వంగా జ‌రిగింది. ఈ సందర్భంగా ఉదయం ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపట్టారు. మ‌ధ్యాహ్నం భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు. ఆ త‌రువాత ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపట్టి భ‌క్తుల‌కు పంపిణీ చేశారు. శుద్ధి అనంతరం సాయంత్రం సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు.

పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా సాయంత్రం 6.45 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూసి వేసి ఆదివారం ఉద‌యం 4 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరుస్తారు. శుద్ధి అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ సుబ్బ‌రాజు, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ ర‌వికుమార్‌, శ్రీ బాల‌కృష్ణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.