MAHA SHIVRATRI FESTIVITIES AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభ‌వంగా మహాశివరాత్రి వేడుకలు

Tirupati, 11 Mar. 21: TTD organised the grand Maha Shivratri festival at the Sri Kapileswara Swamy temple on Thursday.

TTD commenced Sarva darshan at 5.30 am in the morning by facilitating devotees with queue lines, drinking water and parking arrangements.

As part of the ongoing annual Brahmotsavam, Bhogi Ratham was conducted in Ekantham in the morning. Thereafter Snapana Tirumanjanam was performed for Sri Somaskandamurty and Sri Kamakshi Ammavaru in the afternoon. In the evening Nandi vahana, was conducted in ekantham.

SPECIAL SERVICE BY SRIVARI SEVAKULU

 The Srivari Sevakulu rendered dedicated service by guiding the devotees on Covid guidelines to observe social distancing, wear masks and serving sanitizers.

 SHIVA PARVATHI KALYANA MAHOTSAVAM

 On March 12, Friday Siva Parvathi Kalyana Mahotsavam will be organised in Ekantham as part of the Brahmotsavam.

DyEO Sri Subramaniam, Superintendent Sri Bhupathi, Inspectors Sri Reddy Sekhar Sri Srinivasa Nayak, temple Archakas etc. Were present on the festivities observed on Thursday. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభ‌వంగా మహాశివరాత్రి వేడుకలు
         
తిరుపతి, 2021 మార్చి 11: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల మేరకు భక్తులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఉద‌యం 5.30 గంట‌ల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది.

ఏకాంతంగా భోగితేరు ఆస్థానం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు భోగితేరు ఆస్థానం జరిగింది. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఆత్మ రథికుడు. శరీరమే రథం. బుద్ధి సారథి. మనస్సు పగ్గం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది.

ఆ తరువాత ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు అర్చకులు స్నపన తిరుమంజనం ఏకాంతంగా నిర్వహించారు. శ్రీస్కోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి, అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఏకాంతంగా నంది వాహ‌నం ఆస్థానం నిర్వ‌హిస్తారు. మార్చి 12వ తేదీ శుక్ర‌వారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.

శ్రీవారి సేవకుల విశేష సేవలు

ఆలయానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకులు విశేష సేవలందించారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణతో పాటు భక్తులు భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా సూచనలు చేశారు. భక్తులందరికీ శానిటైజర్ స్ప్రే చేశారు.

మార్చి 12న శివపార్వతుల కల్యాణం :

శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన శుక్రవారం శివపార్వతుల కల్యాణ మహోత్సవం ఏకాంతంగా జరుగనుంది. సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.