DAKSHINAMURTY HOMAM HELD _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా ద‌క్షిణామూర్తి హోమం

Tirupati, 31 October 2022: As part of homa mahotsavams going on Sri Kapileswara Swamy temple in Tirupati, Sri Dakshinamurty Homam was held on Monday.

On November 1, Sri Kalabhairava Swamy Homam will be performed.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా ద‌క్షిణామూర్తి హోమం

తిరుపతి, 2022 అక్టోబ‌రు 31: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా సోమ‌వారం ద‌క్షిణామూర్తి హోమం శాస్త్రోక్తంగా జరిగింది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు ద‌క్షిణామూర్తి హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, ద‌క్షిణామూర్తి కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి శ్రీ ద‌క్షిణామూర్తి స్వామివారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టారు.

న‌వంబరు 1న శ్రీ కాలభైరవ స్వామివారి హోమం

న‌వంబ‌రు 1వ తేదీ శ్రీ కాలభైరవ స్వామివారి హోమం జ‌రుగ‌నుంది. గృహస్తులు రూ. 500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ శ్రీ‌నివాసులు, సూప‌రింటెండెంట్లు శ్రీ భూప‌తి, శ్రీ శ్రీ‌నివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాల‌క్రిష్ణ‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.