HOMA MAHOTSAVAM POSTERS RELEASED _ శ్రీ కపిలేశ్వరాలయ హోమ మహోత్సవాల పోస్టర్లు అవిష్కరణ

Tirupati, 24 Oct. 19: The Karthika Masa Homa Mahotsavams of Kapilatheertham temple was released by JEO Sri P Basant Kumar on Thursday. 

The month-long fete will take place from October 29 to November 26 in Sri Kapileswara Swamy temple in Tirupati. 

In the poster release event which took place in JEO Chamber in TTD Administrative Building in Tirupati,  Temple DyEO Sri Subramanyam was also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయ హోమ మహోత్సవాల పోస్టర్లు అవిష్కరణ

తిరుపతి , అక్టోబరు 24, 2019: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 29 నుంచి న‌వంబరు 26వ తేదీ వరకు నెల రోజుల పాటు జరుగనున్న హోమ మహోత్సవాల పోస్టర్లను టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని జెఈవో కార్యాల‌యంలో గురువారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ హోమ మహోత్సవాల్లో భాగంగా అక్టోబరు 29 నుంచి 31వ తేదీ వరకు శ్రీ గణపతిస్వామివారి హోమం, న‌వంబరు 1, 2వ తేదీల్లో శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం, న‌వంబరు 2న శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామివారి కల్యాణోత్సవం, న‌వంబరు 3న శ్రీ నవగ్రహ హోమం నిర్వహిస్తార‌న్నారు.

అదేవిధంగా న‌వంబరు 4న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం , న‌వంబరు 5 నుంచి 13వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీహోమం), నవంబరు 14 నుంచి 24వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం), నవంబరు 25న శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, నవంబరు 26న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు.

కాగా, గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా ప్రతిరోజూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా కాలక్షేపం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి , టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ దిలీప్ కుమార్‌, రెడ్డిశేఖర్ ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.