KAT HELD ON KRT _ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 17 March 2023: The traditional temple cleansing ritual Koil Alwar Tirumanjanam was held in Sri Kodandarama temple in Tirupati on Friday.

The annual brahmotsavam are scheduled between March 20-28 and in connection with this the temple cleaning ritual was observed between 6.30am and 9:30am.

Hyderabad-based Smt Prasanna Reddy and Tirupati-based Sri Mani have donated five and four temple curtains respectively for the occasion.

DyEOs Smt Nagaratna, Sri Govindarajan, AEO Sri Mohan, Superintendent Sri Ramesh, Chief Priest Sri Anandakumar Deekshitulu were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2023 మార్చి 17: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 20 నుండి 28వతేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది.

ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు పూశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

ఆలయానికి పరదాలు విరాళం :

శ్రీ కోదండరామాలయానికి శుక్రవారం హైదరాబాదుకు చెందిన శ్రీమతి ప్రసన్నరెడ్డి అనే భక్తురాలు 5 మరియు తిరుపతికి చెందిన శ్రీ మణి 4 పరదాలు, కురాళాలు, కర్టన్లను విరాళంగా అందించారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీమతి నాగరత్న, శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి.ఆనంద‌కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సురేష్, శ్రీ చలపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.