శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో విశేష ఉత్సవాలు
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2026 సెప్టెంబరు 01: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
• సెప్టెంబరు 4న గోకులాష్టమి సందర్భంగా సాయంత్రం శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, అనంతరం బంగారు వాకిలి చెంత పురాణ ప్రవచనం, గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.
• సెప్టెంబరు 7న చిన్న వీధి ఉట్లోత్సవం, ఆగస్టు 8న పెద్ద వీధి ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.
• సెప్టెంబరు 12న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్వనం ఇవ్వనున్నారు.
– సెప్టెంబరు 21న శ్రీ గోవింద రాజస్వామివారి అలయంలో పత్రోత్సవాలకు అంకురార్పణ
• సెప్టెంబరు 22 నుండి 24వ తేదీ వరకు పత్రోత్సవాలు
• సెప్టెంబరు 26న పౌర్ణమి సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామివారి గరుడ సేవ.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
