VISESHA HOMAMS PERFORMED _ శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ మహాసంప్రోక్షణలో విశేష హోమాలు 

Tirupati, 22 May 2023: The ongoing Maha Samprokshanam rituals in Sri Govindaraja Swamy temple witnessed visesha homams in Tirupati on Monday.

Both the seers of Tirumala, Archaka Sri Srinivasa Deekshitulu, DyEO Smt Shanti and other office staff tool part in Panchagavya Aradhana and other homams.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ మహాసంప్రోక్షణలో విశేష హోమాలు

తిరుపతి, 2023 మే 22: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలలో భాగంగా సోమ‌వారం విశేష హోమాలు నిర్వ‌హించారు.

ఉదయం 8 నుండి 11 గంటల వరకు యాగ‌శాల‌లో హోమగుండాల‌ను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, కుంభారాధ‌న‌, పంచగవ్యారాధన నిర్వ‌హించారు. త‌రువాత ఉక్త హోమాలు, పంచసూక్త హోమాలు జ‌రిగాయి.

సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.