GOLD LACING OF SRI GT VIMANAM TO COMPLETE BY 2022- TTD EO _ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య విమాన గోపురానికి బంగారు పూత

Tirupati, 24 July 2021: TTD Executive officer Dr KS Jawahar Reddy said the gold lacing on copper plates of the Vimana of Sri Govindaraja Swamy temple with 100 kg gold costing Rs.32 crore will be completed by May 2022.

Speaking at a review meeting held at Sri Govindaraja Swamy temple on Saturday afternoon with Tirumala pontiffs, Vaikhanasa Agama Advisors, officials and Archakas, the TTD EO directed the officials to commence works from September 14 on the occasion of the Balalaya ritual slated at the Kalyana mandapam of the temple.

He directed the engineering officials to ensure the devotees to have comfortable Darshan and daily rituals at Sri Govindaraja Swamy Temple should not be disturbed during the Balalaya event.

Earlier the Tirumala pontiffs, Agama Advisors, Chief Archaka and officials gave valuable suggestions on the gold lacing of the Vimana. The EO also inspected the sub-temples and directed the officials to beautify the Addala Mahal in the temple as part of development works.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, JEO Smt Sada Bhargavi, CE Sri Nageswara Rao, FA and CAO Sri O Balaji, Vaikhanasa Agama Advisor Sri Vishnu Bhattacharyulu, SE Sri Jagadeeshwar Reddy, Special grade DyEO Sri Rajendrudu, DyEO Sri Govindarajulu, Chief Archaka Sri AP Srinivasa Dikshitulu and AEO Sri Ravikumar Reddy were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య విమాన గోపురానికి బంగారు పూత

– 2022 మే నాటికి పూర్తి – టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుపతి, 2021 జూలై 24: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో బంగారు పూత పూయ‌బ‌డిన రాగి రేకులు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ‌నివారం మ‌ధ్యాహ్నం జీయ్యంగార్లు, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారులు, అర్చ‌కులు, అధికారుల‌తో ఈవో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ స్వామివారి ఆల‌య విమాన గోపురానికి బంగారు పూత పూయ‌బ‌డిన రాగి రేకులు అమర్చేందుకు ఈ ఏడాది సెప్టెంబ‌రు 14న ప‌నులు ప్రారంభించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం ఆల‌యంలోని క‌ళ్యాణ మండ‌పంలో బాలాల‌యం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. దాదాపు 32 కోట్ల విలువైన వంద కిలోల బంగారాని టిటిడి ట్రెజ‌రీ నుండి తీసుకోవాల‌న్నారు. బంగారు తాప‌డం ప‌నులు 2022 మే నెల‌కు పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. భ‌క్తుల‌కు మూల మూర్తి ద‌ర్శ‌నం ఉంటుంద‌ని, స్వామివారి కైంక‌ర్యాలు బాలాల‌యంలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు.

అంత‌కుముందు జీయ్యంగార్లు, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారులు, ప్ర‌ధాన అర్చ‌కులు, అధికారుల‌తో బంగారు తాప‌డం ప‌నుల‌పై స‌మీక్షించి ప‌లు సూచ‌న‌లు చేశారు. త‌రువాత ఆల‌యంలోని ఉప ఆల‌యాల‌ను ద‌ర్శించుకున్నారు. అనంత‌రం అద్దాల మ‌హాల్‌ను ప‌రిశీలించి మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా అధునీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్యార్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ్యార్ స్వామి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజి, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ విష్ణు బ‌ట్టాచార్యులు, ఎస్ఈ శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజులు, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి శ్రీ‌నివాస దీక్షితులు ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.