MAJESTIC VASANTHOTSAVAM AT SRI PAT _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా వసంతోత్సవం

Tiruchanoor, 27 Nov. 19: As part of ongoing annual Brahmotsavams, the TTD organised grand Vasantotsavam at Sri Padmavathi Ammavari temple, Tiruchanoor with Procession of utsava idols on mada street on Wednesday morning.

Also termed as Upasamanotsavam, the holy festival was performed to give a soothing feel to the deity who participated in several daily rituals and vahana sevas during Brahmotsavams, say archakas.

The spectacular event was marked by abhisekam to Ammavaru with aromatic water and spraying scented water by devotees on each other at the mada street. 

TTD Executive Officer Sri Anil Kumar Singhal also participated in the traditional practice of spraying scented waters on devotees on mada streets. Thereafter Goddess Padmavathi took out a celestial ride magestically on Gaja vahanam on Wednesday evening.

Temple DyEO Sri Govindarajan, VSO Sri Prabhakar, AEO Sri Subramanyam, AVSO Sri Nandeeswar Rao and other officials, devotees participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా వసంతోత్సవం
 
తిరుపతి, 2019 నవంబరు 27: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో బుధవారం సాయంత్రం వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
 
తిరుచానూరులో మార్గశిర మాసం పాడ్యమి రోజున వసంతోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం చల్లదనం కోసం చందనం జలాన్ని మాడ వీధుల్లో భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఉత్సాహంగా భక్తులపై వసంతాలు చల్లారు. వసంతోత్సవంలో పాల్గొన్న తరువాత అమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి విఎస్వో శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఏవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్‌రావు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.