శ్రీ వేంకటేశ్వర బధిర ఉన్నతపాఠశాలలో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

శ్రీ వేంకటేశ్వర బధిర ఉన్నతపాఠశాలలో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

తిరుపతి, మే-26,2008: తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. శ్రీ వేంకటేశ్వర బధిర ఉన్నతపాఠశాల, తిరుపతి నందు 2008-2009 విద్యాసంవత్సరమునకుగాను ప్రిపరేటరి కోర్సునందు విద్యార్థులను చేర్చుకొనుటకు గాను అర్హులైన రాయలసీమజిల్లా మరియు నెల్లూరుజిల్లా వాసుల విద్యార్థుల నుండి ధరఖాస్తులు కోరడమైనది.

తిరుమల తిరుపతి దేవస్థానములు యాజమాన్యములోని బధిర ఉన్నతపాఠశాల, తిరుపతి నందు 2008-2009 విద్యాసంవత్సరమునకుగాను అర్హత కలిగిన విద్యార్థులనుండి ప్రిపరేటరి కోర్సునందు చేర్చుకొనుటకు మే నెల 31వ తారీఖు వరకు ధరఖాస్తులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మరియు పూర్తి చేసిన ధరఖాస్తు ఫారములను జూన్‌ నెల 6వ తారీఖు వరకు స్వీకరింపబడునని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇతర వివరములకు బధిర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వారిని  ఫోన్‌ నెంబరు – 0877-2264616 సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.